Site icon HashtagU Telugu

International Day of Families: నేడు అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం..ప్రాముఖ్యత ఏంటంటే..!!

international day for families

International day of families today

మనం విజయం సాధించినప్పుడు చప్పట్లు కొట్టేవారు…మనం ఓడిపోయినప్పుడు భుజం తట్టేవారు…నా అనే నలుగురు లేనప్పుడు ఎంత సంపాదించినా…ఎంత పోగొట్టుకున్నా ఎలాంటి తేడా ఉండదు. సంతోషం, బాధ,దు:ఖం, ప్రేమ, అనుబంధాలు, కలహాలు ఆత్మీయతలు…
ఇవన్నీ ఒకేచోట కలిసుండేదే కుటుంబం…భిన్న రకాల మనస్తత్వాలు, అభిప్రాయాలున్న వ్యక్తులను ఒకేచోట అనుబంధంగా మార్చేదే కుటుంబం. మాన భారతీయ కుటుంబం అంతులేని శక్తికి, బలానికి సూచికగా నిలుస్తోంది. పిల్లల ఆనందాన్ని తమ సంతోసంగా భావించే తల్లిదండ్రులు, కన్నవారి కలలను నెరవేర్చాలన్న పిల్లల తపన. ఎప్పుడూ ప్రేమ ఆత్మీయలతో కలిసుండేది కుటుంబం. మన భారతీయ సంప్రదాయంలోఉమ్మడి కుటుంబాలకు ప్రత్యేకం. మే 15 అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం. మరి ఈ రోజును ఎందుకు జరుపుకుంటాు…ఈరోజుకు ఉన్న ప్రత్యేకత ఏంటి తెలుసుకుందాం.

1983లో ఐక్యరాజ్యసమితి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కుటుంబలపై ఫోకస్ పెట్టింది. ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, సోషల్ డెవలప్ మెంట్ కమిషన్ అప్పటి సెక్యూరిటీ జనరల్ కుటుంబాల సమస్యలు, వారి అవసరాలు గురించి తెలియజేసింది. మే 29, 1985న ఆమోదించిన తీర్మానంలో కౌన్సిల్ సిఫారసుపై జనరల్ అసెంబ్లీ డెవలప్ మెంట్ ప్రక్రియలో కుటుంబాలు అనే అంశాన్ని కూడా చేర్చారు. డిసెంబర్ 1989లో ప్రతి ఏడాది మే 15న జరపుకునే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని ప్రకటించింది. ప్రతి ఏడాది విభిన్న ఇతివ్రుత్తాన్ని కలిగి ఉంటుంది.

ఈ రోజు ప్రత్యేకత ఏంటంటే…ప్రేమానుబంధాల కుటుంబాలను నిర్మించడం. అంటే ప్రస్తుతం కుటుంబాలలో ప్రేమ, ఆత్మీయతలు కరువైయ్యాయి. చిన్న చిన్న అపార్థాలతో కుటుంబాలు విచ్చిన్నమవుతున్నాయి. ప్రపంచం అభివ్రుద్ధి చెందుతున్న క్రమంలో ఈ మార్పులు కుటుంబాలపై ప్రభావం చూపిస్తున్నాయి. అయితే ఈ మార్పును వారు ఎలా స్వీకరిస్తారన్నదానిపై ఆధారపడి ఉంటుంది. ప్రతిరోజూ వచ్చే సమస్యలు, వాటిమీదున్న అవగాహన పెంచుకోవడం వలన కుటుంబాలపై మరింత అవగాహన పెరిగే అవకాశం ఉంటుంది.