Internation Day of Peace : నేడు అంతర్జాతీయ శాంతి దినోత్సవం..!

ప్రపంచ శాంతి దినోత్సవం (Internation Day of Peace ) లేదా అంతర్జాతీయ శాంతి దినోత్సవం ప్రతి ఏడాది సెప్టెంబర్ 21న జరుపుకుంటారు. శాంతి వ్యాప్తిపై దృష్టి సారించేలా ఈరోజున ప్రపంచవ్యాప్తంగా

Published By: HashtagU Telugu Desk
Internation Day Of Peace W

Internation Day Of Peace W

ప్రపంచ శాంతి దినోత్సవం (Internation Day of Peace ) లేదా అంతర్జాతీయ శాంతి దినోత్సవం ప్రతి ఏడాది సెప్టెంబర్ 21న జరుపుకుంటారు. శాంతి వ్యాప్తిపై దృష్టి సారించేలా ఈరోజున ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ ప్రపంచ శాంతి యొక్క ప్రాముఖ్యతను ప్రచారం చేస్తారు. ప్రపంచ శాంతిని సాధించాలనే లక్ష్యంతో ఈ అంతర్జాతీయ శాంతి దినోత్సవం జరుపుకుంటారు.

ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 1981లో అంతర్జాతీయ శాంతి (Internation Day of Peace ) దినోత్సవాన్ని స్థాపించింది. శాంతి ఆదర్శాలను గుర్తుచేసుకోవడానికి శాంతిని బలోపేతం చేయడానికి ఒక రోజు కావాలని జనరల్ అసెంబ్లీ స్వచ్చదంగా ఓటు వేసి ఐక్యరాజ్య సమితిలో మొదటిసారి 1981లో ప్రపంచ శాంతి దినోత్సవాన్ని జరుపుకుంది. మొదట్లో సెప్టెంబర్ నెలలో మూడవ మంగళవారాన్ని అంతర్జాతీయ శాంతి దినోత్సవంగా నియమించింది. అయితే 2002లో ప్రంపంచ శాంతి దినోత్సవాన్ని సెప్టెమర్ 21కి మార్చారు. ప్రపంచ శాంతిలో భాగంగా దేశాల మధ్య సాయుధ పోరాటాలు వినాశకరమైన ఫలితాలు తెలిసిందే. ఇలాంటి చర్యలు జీవితాలను, డబ్బును, మానవత్వాన్ని కోల్పోయేలా చేస్తుంది అందుకే అంతర్జీతాయ శాంతి దినోత్సవం యుద్ధం లేదా హింసను కొనసాగించడానికి బదులుగా సంఘర్షణను పరిష్కరించడానికి సామరస్యాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది.

Also Read : Siri Hanmanth : షారుఖ్ తో ఛాన్స్ అంటే ప్రాంక్ అనుకుందట..!

  Last Updated: 21 Sep 2023, 08:57 AM IST