Site icon HashtagU Telugu

Chandrababu: చంద్రబాబుని విడుదల చేయాలని కువైట్ లో ప్రార్థనలు

Chandrababu (1)

Chandrababu (1)

Chandrababu: ఎన్నారై తెలుగుదేశం కువైట్, జనసేన కువైట్ ఆధ్వర్యంలో చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ.. ఆయన త్వరగా విడుదల కావాలని అన్ని మతాల వారు ప్రార్థనలు చేశారు. ఫర్వానియా ప్రాంతంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా ముస్లిం సంప్రదాయం ప్రకారం ప్రార్థనలు చేసి క్రైస్తవ సంప్రదాయం ప్రకారం బైబిల్ లోని కొన్ని వచనాలను చదివి ప్రార్థనలు చేశారు. చివరకు హిందూ ఆచారం ప్రకారం కలియుగ దేవుడు వెంకన్నని గోవింద నామాలతో కీర్తిస్తూ చంద్రబాబు తొందరగా విడుదల కావాలని ప్రార్థించారు.

తెలుగుదేశం నాయకులు కుదరవల్లి సుధాకరరావు, అక్కిలి నాగేంద్రబాబు, మద్దిన ఈశ్వర్ నాయుడు, దుగ్గి శ్రీనివాస్, కొల్లి ఆంజనేయులు, మద్దిపట్ల శివ, నరేష్, పెంచల్ నాయుడు, సుంకేసుల అన్వర్, గాజులపల్లి సుబ్బారెడ్డి, శివారెడ్డి, మహాసేన రాజేష్ రాపాక, సుబ్బరాజు, షేక్ వల్లీలు, ఈ కార్యక్రమంలో ఉన్నారు. , గల్లా శ్రీనివాస్, పూజుల శివ మరియు జనసేన నాయకులు రామచంద్ర నాయక్, పగడాల అంజన్ కుమార్, శివ తదితరులు పాల్గొన్నారు.

Also Read: Shubman Gill: ఆస్పత్రి నుంచి గిల్ డిశ్చార్జ్, పాక్, బంగ్లాదేశ్ మ్యాచులకూ డౌటే