Interesting Ganesh Idols 2024: గణేష్ నవరాత్రోత్సవాలు వచ్చిదంటే చాలు చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ హుషారుగా పాల్గొంటారు. వీధిలోనో.. కాలనీలోనో ప్రతిష్టించే విగ్రహాన్ని ప్రత్యేకంగా డిజైన్ చేసి అందరి దృష్టి ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. ఇక డేకరేషన్ కూడా మరో లెవెల్‌లో చేసేందుకు సిద్ధం అవుతుంటారు. అయితే.. ఇలాంటి ఒక విగ్రహామే నెల్లూరు జిల్లాలో కొలువుదీరింది. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నెల్లూరు జిల్లాలోని కోవూరు మండలం ఇనమడుగు గ్రామంలో వినూత్నమైన వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏర్పాటు చేసిన గణేషుడు చెయ్యెత్తి భక్తులను ఆశీర్వదిస్తున్నాడు.. అయితే.. కళ్లు ఆర్పుతూ.. చేతిని కదిలిస్తున్న ఈ వినాయకుడు చూసేందుకు భక్తులు తెగ ఎగబడుతున్నారు. ఇనమడుగు మిక్సెడ్ కాలనీకి చెందిన ఠాగూర్ టీమ్ గత 10 సంవత్సరాలుగా విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో ప్రత్యేకంగా వ్యవహరిస్తున్నామని తెలిపింది.
Read Also : Terror Plot To Attack Pope Francis : పోప్ ఫ్రాన్సిస్‌పై దాడికి ఉగ్ర కుట్ర.. భగ్నం చేసిన ఇండోనేషియా పోలీసులు
అయితే.. ఈ సంవత్సరం 36వేల ముత్యాలతో 13 ఫీట్ల శ్వేత గణనాథుడిని ఏర్పాటు చేశారు. దీని తయారీ కోసం దాదాపు నెల రోజులు శ్రమించామని, రూ.1.50 లక్షలు ఖర్చయిందని నిర్వాహకులు చెప్పారు. ఐదు రోజుల పాటు పూజలు నిర్వహించాక విగ్రహంలోని ముత్యాలను భక్తులకు పంచిపెడతామని ఠాగూర్ టీమ్ సభ్యులు తెలిపారు. ఇక పోతే.. విగ్రహా ఏర్పాటులో ప్రత్యేకంగా నిలిచే హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ వినాయకుడు ఈ సారి ‘సప్తముఖ మహాశక్తి గణపతి’గా భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఖైరతాబాద్‌లో గణేశ్ వేడుకలను ప్రారంభించి 70 ఏళ్లు అయిన సందర్భంగా ఈసారి 70 అడుగుల ఎత్తులో వినాయకుడి విగ్రహాన్ని సిద్ధం చేశారు.
ఇదిలా ఉంటే.. తమిళనాడుకు చెందిన బీజేపీ కార్యకర్తలు, సభ్యులు చెన్నైలో విలక్షణమైన వినాయక విగ్రహాన్ని ఆవిష్కరించారు. గణేష్ చతుర్థి సందర్భంగా, అయోధ్యలోని ఐకానిక్ టెంపుల్ యొక్క లార్డ్ రామ్ ఇతివృత్తం ఆధారంగా రూపొందించబడిన దేవుని విగ్రహం బహిర్గతమైంది. అసలు రామ్ లాల్లా ఆలయాన్ని పోలి ఉండేలా నిర్మించారు. ఇదేకాకుండా.. చెన్నైలో ఓ చోట ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహం ప్రత్యేకంగా నిలిచింది. ఈ విగ్రహాన్ని 40 అడుగుల మేర ఏర్పాటు చేయగా.. ఈ విగ్రహ తయారీకి 6000 ఇత్తడి తమలపాకులు, 1500 కామాక్షి దీపాలు, 350 తెల్లని సముద్రపు గవ్వలను వినియోగించారు. అయితే.. ఈ విగ్రహాన్ని ప్రత్యేకంగా డిజైన్ చేయడంతో.. చుట్టూప్రక్కల భక్తులు ఈ విగ్రహాన్ని దర్శించేందుకు భక్తులు పోటెత్తారు.
Read Also : Terror Plot To Attack Pope Francis : పోప్ ఫ్రాన్సిస్‌పై దాడికి ఉగ్ర కుట్ర.. భగ్నం చేసిన ఇండోనేషియా పోలీసులు