మేడ్చల్ జిల్లా అన్నోజిగూడ (Annojiguda)లోని నారాయణ కాలేజీ(Narayana College)లో మరో విద్యార్థి ఆత్మహత్య (Student suicide) ఘటన తీవ్ర కలకలం రేపింది. ఎంపీసీ ఫస్టియర్ చదువుతున్న 16 ఏళ్ల తనుష్ నాయక్ (Tanush Naik) కాలేజీ బాత్రూంలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
తనుష్ తన స్నేహితులకు, కుటుంబ సభ్యులకు మంచి శ్రద్ధ కలిగిన విద్యార్థిగా ఉండేవాడు. అయితే, లెక్చరర్ల వేధింపుల వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఘటన జరిగిన వెంటనే కాలేజీ సిబ్బంది స్పందించి విద్యార్థి తల్లిదండ్రులకు ఫోన్ చేసి తెలుపగా.. విగతజీవిగా పడిఉన్న కుమారుడ్ని చూసి గుండెలు బాదుకున్నారు. తనుష్ ఆత్మహత్య వెనుక అసలు కారణాలను పోలీసు అధికారులు అరా తీస్తున్నారు. విద్యార్థి స్నేహితులను నుంచి వివరాలు సేకరించగా, ఉపాధ్యాయుల ఒత్తిడి, లెక్చరర్ల కఠిన వైఖరి కారణంగానే ఆత్మ హత్య చేసుకొని ఉంటాడని తెలిపారు. తల్లిదండ్రులు మరియు విద్యార్థుల సంఘాలు ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధ్యులను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
Read Also : Nitish Reddy : ఆస్ట్రేలియా గడ్డపై సత్తా చాటుతున్న తెలుగు తేజం నితీశ్ రెడ్డి