Site icon HashtagU Telugu

TS Inter Results: ఫెయిల్ అవుతానేమో అని సూసైడ్.. కానీ 892/1000 మార్కులు

Suicide Hanging 19

Suicide Hanging 19

TS Inter Results: లేని పోని అనుమానంతో ఉరేసుకున్నాడు. కానీ తీరా చూస్తే 892/1000 మార్కులు వచ్చాయి. పరీక్షా ఫలితాలు విడుదల కాకముందే.. సరిగా రాయలేదంటూ అనుమానంతో ఉరేసుకున్న ఘటన మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలం పిక్లా తండా శివారు బోడగుట్ట తండాలో జరిగింది.

మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలం పిక్లా తండా శివారు బోడగుట్ట తండాకు చెందిన ఇంటర్‌ విద్యార్థి గుగులోతు కృష్ణ (19) బైపీసీ పరీక్షలు రాశాడు. అయితే ఫెయిల్ అవుతానేమో అని అనుమానంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రుల కోరిక మేరకు మార్కులు రావనుకున్నాడో ఏమో గానీ ఫలితాలు విడుదల కాకముందే గత నెల ఏప్రిల్ 10న ఉరి వేసుకున్నాడు. సూసైడ్‌ నోట్‌ రాసి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఈ రోజు ఫలితాలు వెలువడగా కృష్ణకి 892/1000 మార్కులు వచ్చాయి. దీంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరు అవుతుంది. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయ్యో బిడ్డ అనుమానంతో చనిపోతివి. గిన్ని మార్కులతో పాసయితివే అంటూ తల్లి దండ్రుల రోదన పలువుర్ని కంటతడి పెట్టించింది.

Read More: edit messages feature : వాట్సాప్ వెబ్ యూజర్స్ కోసం కొత్త ఫీచర్