Inter Results: తెలంగాణలో త్వరలో ఇంటర్ ఫలితాలు.. ఎప్పుడంటే

  • Written By:
  • Updated On - April 10, 2024 / 09:14 PM IST

Inter Results: ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను ఒకేసారి ఏప్రిల్ 20లోగావిడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 29 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలను నిర్వహించారు. ఫలితాల కోసం 9 లక్షల మంది ఇంటర్ విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. పరీక్ష ఫలితాల సాంకేతిక అంశాలపై అధికారులు దృష్టిపెట్టారు. దీనికి వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. పరీక్ష రాసిన విద్యార్థులు, రాయనివాళ్లు, మాల్‌ ప్రాక్టీసుకు పాల్పడిన వాళ్ల సమాచారం నమోదు చేస్తారు. దీంతో పాటు వాల్యూయేషన్‌లో వచ్చిన మార్కులను ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంది.

మార్కులు ఆన్ లైన్ లో నమోదు అనంతరం…ఓఎంఆర్ షీటు కోడ్ డీకోడ్ చేసి ఫలితాలు సక్రమంగా ఉన్నాయో లేదో అధికారులు ఒకటి రెండు సార్లు చెక్ చేస్తారు. ఈ ప్రక్రియ ముగియగానే ఫలితాలను ప్రకటిస్తారు. ఈ ప్రక్రియ మొత్తం ఏప్రిల్‌ 21 నాటికి ముగించాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈసారి టీఎస్ పదో తరగతి ఫలితాలు కాస్త ముందుగానే రానున్నాయి. ఈ నెల 11వ తేదీతో స్పాట్ వాల్యూయేషన్ పూర్తి కానుండగా…. ఏప్రిల్ చివరి వారంలో ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది.