Breaking News : ప్రస్తుత ఫైనాన్స్ మినిస్టర్‌గా హరీశ్ రావు.. ఇంటర్ ప్రశ్నపత్రంలో తప్పు

  • Written By:
  • Publish Date - February 16, 2024 / 07:00 PM IST

తెలంగాణ ఇంటర్ బోర్డు (Telangana Inter Board) అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. ప్రాక్టికల్స్ ప్రశ్నపత్రంలో ప్రస్తుత ఫైనాన్స్ మినిస్టర్‌గా మాజీ మంత్రి హరీష్‌ రావు (Harish Rao)ను పేర్కొంది. పాత ప్రశ్నను యథావిధిగా క్వశ్చన్ పేపర్‌లో ఇవ్వడం వల్లే ఈ తప్పు దొర్లినట్లు తెలుస్తోంది. ఇంటర్ బోర్డు తీరుపై ఇంటర్ లెక్చరర్స్ జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అయితే.. ఇదిలా ఉంటే.. గత సంవత్సరం ఇంటర్ పరీక్ష పత్రాల్లోనూ తప్పులు దొర్లాయి. గత ఏడాది ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు నిర్వహించిన పరీక్షల ప్రశ్నపత్రాల్లో తప్పులు దొర్లాయి. పొలిటికల్ సైన్స్ (సివిక్స్) పేపర్-II పరీక్షలో ప్రశ్న సంఖ్య 8 ప్రశ్న పత్రాల ఇంగ్లీష్, తెలుగు వెర్షన్‌లకు భిన్నంగా ఉంది.

We’re now on WhatsApp. Click to Join.

తెలుగు వెర్షన్‌లోని ప్రశ్న, విద్యార్థులు భారత స్వాతంత్ర్య పోరాటంలో హోమ్ రూల్ ఉద్యమాన్ని వివరించాలని కోరుకున్నారు, అయితే ఇంగ్లీషు వెర్షన్‌లో, ఇది “ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్, 1947లోని ప్రధాన నిబంధనలను సూచించండి”. అలాగే.. మ్యాథమెటిక్స్ IIA ప్రశ్నపత్రం ఉర్దూ వెర్షన్‌లోనూ తప్పులు కనిపించాయి. సెక్షన్-ఎలోని ప్రశ్న నంబర్ 1లో “జర్బీ”కి బదులుగా “ఫర్జీ” ప్రస్తావించబడింది. విభాగం Bలో, ప్రశ్న సంఖ్య 20లో “తీక్” పదం అదనంగా ఉంది. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBIE) వెంటనే విద్యార్థులకు తప్పు సూచనలను పంపడం ద్వారా రెండు తప్పులను సరిదిద్దింది.

అయితే.. తెలుగు మీడియం రసాయన శాస్త్రం ప్రశ్నపత్రంలో గ్రూప్-2ఏ మూలకాలు అని ఇవ్వాల్సి ఉంటే.. గ్రూప్-2 మూలకాలు అని ఇవ్వడంతో విద్యార్థులు గందరగోళానికి గురయ్యారు. ఇంగ్లిష్ మీడియంలో 12వ ప్రశ్నలో రిలేషన్Íప్ అని ఇవ్వాల్సింది పోయి, రిలేషన్ అని, కెమిస్ట్రీలో ధైరోడైనమిక్స్ పదంలో అక్షర దోషాలతో ప్రశ్నా పత్రాలను విద్యార్థులకు అందించారు. ఇదే పేపర్లో ఎక్స్ప్లెయిన్ను తప్పుగా రాశారు. డిఫరెన్సెస్కు బదులు డిఫరెన్స్ అని ఇచ్చారు. కెమిస్ట్రీ ఉర్దూ మీడియంలో ఒక సూత్రాన్ని తప్పుగా ఇచ్చారు. కామర్స్ తెలుగు మీడియంలో డెబిట్ చేసిన అని ఇవ్వాల్సింది పోయి, చెల్లించినా అని ఇచ్చారు. ఇదే పేపర్లో జానకి అనే పేరును సరిగా ముద్రించలేదు. ఇలా గత సంవత్సరం నిర్వహించిన ఇంటర్‌ పరీక్షల్లో తప్పులు దొర్లడంతో ఇంటర్‌ బోర్డు పరువు పోయినట్లైంది. అయితే.. ఈ సంవత్సరమైనా కరెక్ట్‌గా వ్యవహరిస్తరని భావిస్తే.. ఆదిలోనే తప్పులను ముద్రించి తన నిర్లక్ష్యాన్ని చాటుకున్నారు ఇంటర్‌ అధికారులు.
Read Also : Bandi Sanjay : 8మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, 5గురు సిట్టింగ్ ఎంపీలు మాతో టచ్‌లో ఉన్నారు