Instagram Broadcast Channels : ఇన్‌స్టాగ్రామ్ లో బ్రాడ్‌కాస్ట్ ఛానల్‌ ఫీచర్ వచ్చేసింది

ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేరెంట్ కంపెనీ ఫేస్ బుక్ గురువారం ఒక ప్రకటన చేసింది. ఇన్‌స్టాగ్రామ్ క్రియేటర్‌లు తమ ఫాలోయర్‌లతో సంబంధాలను మరింతగా పెంచుకోవడానికి బ్రాడ్‌కాస్ట్ ఛానెల్ సహాయపడుతుందని వెల్లడించింది.

  • Written By:
  • Updated On - June 17, 2023 / 12:11 PM IST

Instagram Broadcast Channels : “బ్రాడ్‌కాస్ట్ ఛానెల్‌”.. ఇప్పటిదాకా టెలిగ్రామ్ లాంటి యాప్స్ లోనే ఉన్న ఈ ఫీచర్ ను ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ కూడా తీసుకొచ్చింది. మనదేశంలో కూడా బ్రాడ్‌కాస్ట్ ఛానెల్‌లను ఇన్‌స్టాగ్రామ్ తాజాగా ప్రారంభించింది. ఇకపై ఇన్‌స్టాగ్రామ్ క్రియేటర్లు బ్రాడ్‌కాస్ట్ ఛానెల్‌ ద్వారా వారి ఫాలోయర్స్ ను ఇన్ వైట్ చేయొచ్చు. వాటి ద్వారా టెక్స్ట్, వీడియో, ఫోటోగ్రాఫిక్ అప్‌డేట్‌లను సైతం ప్రసారం చేయొచ్చు. కాబట్టి ఇది ఇన్ స్టాలో మంచి పబ్లిక్ కమ్యూనికేషన్ సాధనంగా ఉపయోగపడుతుంది. ఈమేరకు వివరాలతో ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేరెంట్ కంపెనీ ఫేస్ బుక్ గురువారం ఒక ప్రకటన చేసింది. ఇన్‌స్టాగ్రామ్ క్రియేటర్‌లు తమ ఫాలోయర్‌లతో సంబంధాలను మరింతగా పెంచుకోవడానికి బ్రాడ్‌కాస్ట్ ఛానెల్ సహాయపడుతుందని వెల్లడించింది. ఇన్‌స్టాగ్రామ్ క్రియేటర్లు లేటెస్ట్ అప్‌డేట్‌లను ఇతరులతో షేర్ చేసుకోవడానికి కూడా ఈ ఫీచర్ ఉపయోగ పడుతుందని తెలిపింది.

క్రియేటర్లకు మాత్రమే ఛాన్స్..

ఫోటో, వీడియోలతో పాటు బ్యాక్ గ్రౌండ్ లో వినిపించేలా వాయిస్ నోట్స్‌ని యాడ్ చేసే సౌలభ్యం బ్రాడ్‌కాస్ట్ ఛానెల్‌ లో ఉంది. క్రియేటర్లు తమ అభిమానుల అభిప్రాయాన్ని సేకరించేందుకు పోల్‌లను రూపొందించే ఆప్షన్ సైతం ఉంటుంది. బ్రాడ్‌కాస్ట్ ఛానెల్ లలో సందేశాలను పంపే అవకాశం క్రియేటర్లకు మాత్రమే ఉంటుంది. అయితే వారి ఫాలోయర్లు ఆ కంటెంట్‌పై తమ రియాక్షన్స్ ను తెలియజేయొచ్చు.. పోల్‌లలో ఓటింగ్‌ వేయొచ్చు.

బ్రాడ్ కాస్ట్ ఛానల్స్ ఎలా పని చేస్తాయి?

బ్రాడ్‌కాస్ట్ ఛానెల్ కు యాక్సెస్ పొందిన తర్వాత ఇన్‌స్టాగ్రామ్ క్రియేటర్ (Instagram Creator) వారి ఇన్‌బాక్స్ ద్వారా ప్రారంభ సందేశాన్ని పంపాలి. దీంతో వారి ఫాలోయర్లకు ఛానెల్‌లో చేరమని ప్రాంప్ట్ చేసే ఒక నోటిఫికేషన్‌ వెళ్తుంది. ఎవరైనా బ్రాడ్‌కాస్ట్ ఛానెల్‌ని చూడొచ్చు. దాని కంటెంట్‌ని యాక్సెస్ చేయొచ్చు. వాస్తవానికి ఛానెల్‌లో చేరిన ఫాలోయర్లు మాత్రమే కొత్త అప్‌డేట్‌లు వచ్చినప్పుడు తదుపరి నోటిఫికేషన్‌లను స్వీకరిస్తారు. ఫాలోయర్లు ఎప్పుడైనా బ్రాడ్‌కాస్ట్ ఛానెల్‌ లను అన్ ఫాలో చేయొచ్చు.. మ్యూట్ చేయొచ్చు.. ఇన్‌స్టాగ్రామ్ క్రియేటర్ ప్రొఫైల్‌ లోకి వెళ్లి బెల్ చిహ్నాన్ని నొక్కి వారి నుంచి వచ్చే నోటిఫికేషన్‌లను కంట్రోల్ చేయొచ్చు.

బ్రాడ్ కాస్ట్ ఛానల్స్ లో ఎలా చేరాలి?

బ్రాడ్ కాస్ట్ ఛానల్ ను యాక్సెస్ చేయడానికి చాలా ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. మీరు క్రియేటర్ స్టోరీ స్టిక్కర్ ద్వారా లేదా ఇన్‌స్టాగ్రామ్ క్రియేటర్ ప్రొఫైల్‌కు పిన్ చేసిన లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా దాన్ని యాక్సెస్ చేయొచ్చు. మీరు బ్రాడ్‌కాస్ట్ ఛానెల్‌కి చేరుకున్న తర్వాత, “జాయిన్” అనే ఆప్షన్ పై నొక్కండి.

Also Read:  Malavika Mohanan : ఎద భాగాలను చూపిస్తున్న మాళవిక మోహనన్