Site icon HashtagU Telugu

Hyderabad: హైదరాబాద్ లో నకిలీ కరెన్సీ తయారీ ముఠా అరెస్ట్

Hyderabad

Hyderabad

Hyderabad: సులభంగా డబ్బు సంపాదించాలన్న అత్యాశ కొందర్ని కటకటాల పాలు చేస్తుంది. నకిలీ కరెన్సీ తయారు చేసి మార్కెట్లోకి వదులుతున్నారు. 500 నోట్లను టర్గెట్ చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు పట్టుబడి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ముఖ్యంగా యువత పెడదారి పడుతుంది. తాజాగా హైదరాబాద్ లో నకిలీ నోట్లను తయారు చేసి మార్కెట్లో చెలామణి చేసిన ఇద్దరు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేసి, కేసు నమోదు చేశారు.

హైదరాబాద్ లో నకిలీ కరెన్సీ తయారు చేసి మార్కెట్లో చెలామణి చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు వ్యక్తులు పట్టుబడగా 4 లక్షలకు పైగా విలువైన నకిలీ డబ్బును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి 810 నకిలీ 500 నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రింటర్లు, స్కానర్‌ తదితర వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులిద్దరిని బాలనగర్ ఎస్ఓటి మరియు అల్లాపుర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రధాన నిందితుడు వనం లక్ష్మీనారాయణ కంప్యూటర్‌ నైపుణ్యంతో స్క్రీన్ ప్రింటర్, గ్రీన్ ఫాయిల్ పేపర్, జేకే ఎక్సెల్ బాండ్ పేపర్లు, కట్టర్లు, ల్యామినేషన్ మెషిన్‌ కొనుగోలు చేశాడు. ‘ ఫర్జీ ‘ వెబ్ సిరీస్ చూసి నకిలీ నోట్లను తయారు చేయాలనుకున్నారు. పరిచయస్తుడు ఎరుకల ప్రణయ్ కుమార్ తో నకిలీ కరెన్సీ విషయాన్నీ చెప్పి ఒప్పించాడు. నకిలీ కరెన్సీని మార్కెట్ లో మార్పించేందుకు సహాయ పడితే వాటా ఇస్తానన్నాడు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో వీరు ఇద్దరు కలిసి 500 నకిలీ కరెన్సీ చలామణి చేశారు.

Also Read: Poonam Pandey Death Stunt: పూనమ్ పాండే అలా చేయడంలో తప్పేముంది: భర్త

Exit mobile version