Arabian Restaurant : చార్మినార్ వద్ద రెస్టారెంట్స్ లలో తింటున్నారా? అయితే జాగ్రత్త ..!!

హైదరాబాద్ - ఓల్డ్ సిటీలోని చార్మినార్ వద్ద ఉన్న అరేబియానా రెస్టారెంట్ తనిఖీ చేయగా మురికిగా ఉన్న రిఫ్రిజిరేటర్లో నిల్వ ఉంచిన మాంసాన్ని ఫుడ్ సేఫ్టీ అధికారుల గుర్తించారు

  • Written By:
  • Publish Date - May 31, 2024 / 12:31 PM IST

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజులుగా ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటల్స్ లలో తనిఖీలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. సదరు హోటల్ యాజమాన్యాలు ఫుడ్ విషయాల్లో జాగ్రత్తలు పాటిస్తున్నారా..లేదా అని తనిఖీలు చేస్తూ..ఎక్కడిక్కడే నోటీసులు జారీ చేయడం..సీజ్ చేయడం చేస్తూ వస్తున్నారు. వీరి తనిఖీల్లో ప్రముఖ హోటల్స్ సైతం ఫుడ్ జాగ్రత్తలు పాటించడం లేదని తేలింది. తాజాగా హైదరాబాద్ – ఓల్డ్ సిటీలోని చార్మినార్ వద్ద ఉన్న అరేబియానా రెస్టారెంట్ తనిఖీ చేయగా మురికిగా ఉన్న రిఫ్రిజిరేటర్లో నిల్వ ఉంచిన మాంసాన్ని ఫుడ్ సేఫ్టీ అధికారుల గుర్తించారు. దీనిపై యాజమాన్యం ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఉప్పు, పసుపు, కారం నుంచి దినుసుల వరకు క్షుణ్నంగా తనిఖీలు జరిపారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక చాల హోటళ్లు, రెస్టారెంట్లలో సిట్టింగ్ ఏరియా మాత్రమే శుభ్రంగా, ఆహ్లాదకరమైన ఆంబియన్స్‌తో ఉంటుందని.. కిచెన్ మాత్రం పరమ చెత్తగా ఉంటుందన్న విషయం ఈ దాడుల్లో బయటపడుతోంది. అందుకు సంబంధించిన ఫొటోలు చూస్తుంటే.. మళ్లీ జీవితంలో అటువైపు కన్నెత్తి కూడా చూడలేరు. అంతేందుకు.. బయటతినాలన్న ఆలోచనను కూడా విరమించుకునేలా ఉన్నాయి. ఇక అధికారుల తనిఖీలతోనైనా హోటల్స్ యాజమాన్యాలు జాగ్రత్తలు తీసుకుంటారో చూడాలి.

Read Also : Team India: అమెరికాలో టీమిండియా ఆట‌గాళ్ల అసంతృప్తి.. స‌రైన సౌక‌ర్యాలు లేవ‌ని కామెంట్స్..!