Site icon HashtagU Telugu

Mahmood Ali: హోంమంత్రి మహ్మద్ అలీ వాహనం తనిఖీ

Mahmood Ali

Mahmood Ali

Mahmood Ali: నవంబర్ 30న తెలంగాణలో ఎన్నికలు ఉండటంతో ఎన్నికల సంఘం అధికారులు, ప్రత్యేక పోలీస్ అధికారుల ఎమ్మెల్యేలు, మంత్రుల వాహానాలను విధిగా తనిఖీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం వరంగల్ లోని నర్సాపూర్ సమీపంలో హోమంత్రి మహ్మద్ అలీ వాహనాన్ని పోలీసులు తనికీ చేశారు. పోలీసు సిబ్బంది హోం మంత్రి మహమ్మద్ అలీ కాన్వాయ్ వాహనాలను కూడా క్షుణంగా పరిశీలించారు. మహ్మద్ అలీ చెకింగ్ సమయంలో  పోలీసులకు సహకరించారు.

ఇక తెలంగాణలో ఎన్నికలకు దాదాపు 27 రోజులే ఉండటంతో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు, మంత్రి కేటీఆర్ నేతృత్వంలోని నాయకులతో ప్రచారం తీవ్రస్థాయిలో జరుగబోతోంది. బీఆర్‌ఎస్ 116 నియోజకవర్గాలకు, కాంగ్రెస్ 100, బీజేపీ 88 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాయి. సీపీఎం ఒంటరిగానే బరిలోకి దిగుతోంది.