Site icon HashtagU Telugu

INS Vikrant: ఐఎన్ఎస్ విక్రాంత్ సెప్టెంబర్ 2న భారత నౌకాదళంలోకి చేరనుంది

Ins Vikrant Imresizer

Ins Vikrant Imresizer

పూర్తిగా స్వదేశీ సాంకేతికతో తయారుచేసిన భారతతొలి యుద్ధవిమాన వాహక నౌక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ను సెప్టెంబర్‌ 2న ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని భారత నేవీ వైస్‌ చీఫ్‌ వైస్‌ అడ్మిరల్‌ ఎస్‌ఎన్‌ ఘోర్మడే గురువారం వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమక్షంలో సెప్టెంబర్‌ 2 నుంచి దీనిని ప్రారంభిస్తామని చెప్పారు.

ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ 88 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పతి చేస్తుంది, ఇందులో 2,300 కంపార్ట్‌మెంట్లు ఉన్నాయని, 1,700 మంది సిబ్బంది పనిచేస్తారని తెలిపారు. సుమారు 30 యుద్ధవిమానాలను మోసే సామర్థ్యం ఉన్న ఐఎన్‌ఎస్‌ ప్రారంభంతో హిందూ మహాసముద్రం, ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో శాంతి భద్రతల స్థిరత్వం పెరుగుతుందని చెప్పారు. నవంబర్‌ నుంచి ల్యాండింగ్‌ పరీక్షలు ప్రారంభిస్తామని, ఇవి వచ్చే ఏడాది మధ్యనాటికి పూర్తవుతాయని తెలిపారు.

వచ్చే ఏడాది చివరి నుంచి ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ పూర్తి స్థాయిలో కార్యకలాపాలు నిర్వహించడం ప్రారంభిస్తుందని చెప్పారు.