Site icon HashtagU Telugu

యూకే ప్ర‌ధానిగా రిషి సునాక్ .. అల్లుడికి శుభాకాంక్ష‌లు తెలిపిన ఇన్ఫోసిస్ నారాయ‌ణ‌మూర్తి

Rishi Sunak

యూకే ప్రధానమంత్రిగా నియమితులైన రిషి సునక్‌కి ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి శుభాకాంక్షలు తెలిపారు. అల్లుడు సునక్ విజయంపై నారాయ‌ణ‌మూర్తి స్పందించారు. తాము చాలా గ‌ర్వ‌ప‌డుతున్నామ‌ని.. ఆయ‌న‌ విజయాన్ని కోరుకుంటున్నానని తెలిపారు. యునైటెడ్ కింగ్‌డమ్ ప్రజల కోసం తన వంతు కృషి చేస్తాడని తాము విశ్వసిస్తున్నామని తెలిపారు. రిషి సునక్ ఔన్నత్యంపై ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సంతోషం వ్యక్తం చేశారు. బ్రిటీషర్లు భారతదేశాన్ని 200 ఏళ్లకు పైగా పాలించారని.. ఇంత పెద్ద అభివృద్ధిని తాము ఊహించలేదని బొమ్మై అన్నారు. నేడు, భారతీయులు అన్ని రంగాలలో ఉన్నారని.. అనేక దేశాలలో ఎంపీలుగా ఎన్నికయ్యారని గుర్తు చేశారు.

Exit mobile version