Site icon HashtagU Telugu

Terrorist Killed: కుప్వారాలో పాక్‌ ఉగ్రవాది హతం

Terrorist Killed

Bsf Imresizer

జమ్ముకశ్మీర్‌లోని కుప్వారాలో పాక్‌ ఉగ్రవాది (Terrorist Killed)ని భద్రతా బలగాలు అంతమొందించాయి. కుప్వారాలోని సైద్‌పోరాలో వాస్తవాదీన రేఖ వెంబడి ఉగ్రవాదులు అక్రమ చొరబాటుకు యత్నిస్తున్నారనే సమాచారం మేరకు స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా ఆపరేషన్‌ చేపట్టాయి. దీంతో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాది హతమయ్యాడని కశ్మీర్‌ జోన్‌ పోలీసులు తెలిపారు.

ఉత్తర కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లా పరిధిలోని నియంత్రణ రేఖ వెంబడి సైద్‌పోరా ప్రాంతంలో ఆర్మీ సిబ్బంది చొరబాటు ప్రయత్నాన్ని భద్రతా బలగాలు భగ్నం చేశాయి. చొరబాటుకు యత్నించిన ఉగ్రవాది ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. బుధవారం రాత్రి కుప్వారాలోని సైద్‌పోరా ఫార్వర్డ్ ఏరియాలో ఉగ్రవాదుల బృందం, భద్రతా బలగాల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఆర్మీ, పోలీసుల ఉమ్మడి బృందాలు చొరబాటుదారుల బృందాన్ని అడ్డుకున్న వెంటనే. ఈ ఎన్‌కౌంటర్‌లో సైనికులు విజయం సాధించగా, ఉగ్రవాది హతమయ్యాడు.

Also Read: Maharashtra: మహారాష్ట్రలో భూమి నుండి వింత వింత శబ్దాలు..

కాశ్మీర్ జోన్ పోలీసులు ఒక ట్వీట్‌లో.. గత రాత్రి కుప్వారా పోలీసులకు అందిన నిర్దిష్ట ఇన్‌పుట్ ఆధారంగా సైన్యం, పోలీసుల సంయుక్త బృందం సైద్‌పోరా ఫార్వర్డ్ ఏరియాలో చొరబాటుదారుల సమూహాన్ని అడ్డుకుంది. జాయింట్ టీమ్ ఒక చొరబాటుదారుని హతమయ్యాడు. ఇంకా అన్వేషణ కొనసాగుతోంది, మిగిలిన సమాచారం తర్వాత తెలుస్తుందని పేర్కొన్నారు. కుప్వారా పోలీసులు అందించిన సమాచారం మేరకు భద్రతా సిబ్బంది ఆపరేషన్ ప్రారంభించినట్లు కాశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని, ఉగ్రవాదులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. భద్రతా బలగాలు అంతర్గత ప్రాంతాల్లో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌ను వేగవంతం చేశాయి, దాని ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి.