Site icon HashtagU Telugu

Indiramma houses: ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ పథకం వేగవంతం.. అమలు జరుగుతుంది ఇలా

Indiramma Houses

Indiramma Houses

Indiramma houses: మార్చి 11న ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టింది రేవంత్‌ సర్కార్‌. ఈ నేపథ్యంలో ఈ పథకానికి అర్హులు ఎవరు, ఎలా ఎంపిక చేస్తారు అనే గైడ్‌లైన్స్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. అవేంటో తెలుసుకుందాం.పేదలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని రేవంత్‌ సర్కార్‌ చెబుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని ప్రకటించింది. ఈ క్రమంలోనే గ్యారంటీల అమలుపై దృష్టిపెట్టింది. ఇందుకోసం అభయహస్తం పేరుతో అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. తర్వాత ఒక్కో పథకం అమలుకు శ్రీకారం చుడుతోంది. అభయహస్తం దరఖాస్తుల ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తోంది. గృహజ్యోతి, రూ.500 గ్యాస్‌ సిలిండర్‌ పథకానికి ఇలాగే లబ్ధిదారులను ఎంపిక చేసింది.

తాజాగా ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రకటించింది. ఇల్లులేని పేదలకు ఇంటి నిర్మాణం కోసం ఆర్థికసాయం అందించబోతుంది. పథకం ఆరంభంలోనే ఇంటి నమూనాను సీఎం విడుదల చేశారు.ఇక ఇందిరమ్మ ఇళ్లు పథకానికి ఎవరు అర్హులంటే.. ప్రభుత్వం విడుదల చేసిన గైడ్‌లైన్స్‌ ప్రకారం.. ఇందిరమ్మ ఇంటిని మహిళల పేరిట మాత్రమే ఇస్తారు.

తెల్ల రేషన్‌కార్డు ఉన్న కుటుంబాలు ఈ పథకానికి అర్హులు. తొలిదశలో సొంతంగా జాగా ఉండి, అందులో ఇల్లు లేనివారికి ఆర్థికసాయం అందుతుంది. లబ్ధిదారులు స్థానికులై ఉండాలి. అద్దుకు ఉన్నవారు కూడా అర్హులు.ఇక ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారల ఎంపిక జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆధ్వర్యంలో జరుగుతుంది. కలెక్టర్లు ఫైనల్‌ లిస్టు రెడీ చేస్తారు. గ్రామ పంచాయతీలో ఉన్న జనాభా ఆధారంగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు చేస్తారు. తర్వాత లబ్ధిదారుల జాబితాను గ్రామాల్లో గ్రామ సభలు, పట్టణాల్లు వార్డు మీటింగ్‌లు నిర్వహించి ప్రకటిస్తారు.