Site icon HashtagU Telugu

IndiGo: ఇండిగో అత్యవసర ల్యాండింగ్.. విమానంలోనే ప్రయాణికుడు మృతి!

Indigoflight

Indigoflight

ఇండిగో విమానం పాకిస్థాన్ లోని కరాచీలో అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. ఇండియా నుంచి దోహా వెళ్లాల్సిన ఈ విమానం పాకిస్థాన్ కు వెళ్లాల్సి వచ్చింది. అప్పటికే అస్వస్థతకు గురైన నైజీరియన్‌కు చెందిన ప్రయాణికుడు అత్యవసర ల్యాండింగ్ కాగానే మరణించినట్లు విమానాశ్రయ వైద్య బృందం ప్రకటించింది. ఈ మేరకు  ఇండిగో ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇండిగో ఫ్లైట్ 6E-1736, ఢిల్లీ నుండి దోహాకు నడుస్తుంది. విమానంలో వైద్య అత్యవసర పరిస్థితి కారణంగా కరాచీ ల్యాండ్ అయ్యింది.

అయితే దురదృష్టవశాత్తు, అక్కడికి చేరుకోగానే ప్రయాణీకుడు మరణించాడు. మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా ఇండిగో ఫ్లైట్ పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అనుమతిని కోరాడు. కరాచీ ఎయిర్‌పోర్ట్‌లోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ దానిని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సంబంధిత అధికారుల సమన్వయంతో విమానంలోని ఇతర ప్రయాణికులను తమ తమ గమ్యస్థానాలకు చేరేవేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.