Site icon HashtagU Telugu

IndiGo Vs Air India : ఎయిర్ ఇండియా రికార్డు బ్రేక్.. 500 ఎయిర్‌బస్ లకు ఇండిగో ఆర్డర్‌

Indigo Vs Air India

Indigo Vs Air India

IndiGo Vs Air India : ఇండిగో.. ఎయిర్ ఇండియాకు ధీటుగా దూసుకుపోతోంది.. 

విమానాల కొనుగోలు ఆర్డర్స్ ఇచ్చే విషయంలోనూ పోటీ పడుతోంది. 

ఎయిర్‌బస్‌ తో 500 విమానాల కొనుగోలుకు ఒప్పందాన్నికుదుర్చుకున్నట్లు ఇండిగో  ప్రకటించింది. 

ఇండిగో విమానాల కొనుగోలు  డీల్..  ఎయిర్ ఇండియా డీల్ కంటే పెద్దది. 

ఎయిర్ బస్, బోయింగ్ నుంచి 470 విమానాలు కొంటామని ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎయిర్ ఇండియా వెల్లడించిన సంగతి తెలిసిందే.  

భారతదేశపు అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో.. ఎయిర్‌బస్‌తో 500 విమానాల కొనుగోలుకు ఒప్పందాన్ని కుదుర్చుకుంది.  ఇది విమానయాన చరిత్రలో రికార్డు. ఈ భారీ  కొనుగోలు ఒప్పందం..  ఇటీవల ఎయిర్ ఇండియా సంతకం చేసిన 470 విమానాల కొనుగోలు  ఒప్పందం(IndiGo Vs Air India) కంటే పెద్దది. జూన్ 19న ఫ్రాన్స్ రాజధాని  పారిస్ లో జరిగిన  ఎయిర్ షో వేదికగా ఇండిగో బోర్డ్ ఛైర్మన్ వి సుమంత్రన్, ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్, ఎయిర్‌బస్ సీఈవో గుయిలౌమ్ ఫౌరీ, ఎయిర్‌బస్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ క్రిస్టియన్ షెరర్ మధ్య ఈ ఒప్పందం కుదిరింది. దీంతో ఇప్పటిదాకా ఇండిగో ఆర్డర్ చేసిన ఎయిర్‌బస్ విమానాల సంఖ్య 1,330కి పెరిగింది.

Also read : Indigo: పాకిస్తాన్ కు వెళ్లిన ఇండిగో ఎయిర్ లైన్స్ విమానం.. ఎందుకో తెలుసా?

ఈ ఆర్డర్ తో ఎయిర్‌బస్ కంపెనీకి A320 ఫ్యామిలీ విమానాల అతిపెద్ద  కస్టమర్‌గా ఇండిగో ఆవిర్భవించింది. ఎయిర్‌బస్‌ కు మునుపెన్నడూ ఏ విమానయాన సంస్థ కూడా సింగిల్ ఆర్డర్ లో ఇంతపెద్ద  సంఖ్యలో విమానాల కొనుగోలు ఆర్డర్ ఇవ్వలేదని  ఇండిగో తెలిపింది. ఈ ఆర్డర్ ఇండిగోకు 2030- 2035 సంవత్సరాల మధ్య మరింత స్థిరమైన డెలివరీలను అందిస్తుందని పేర్కొంది. ప్రస్తుతం  300కి పైగా విమానాలతో ఇండిగో ప్రస్తుతం రోజుకు 1800 విమాన సర్వీసులు నడుపుతోంది. 78 దేశీయ గమ్యస్థానాలు, 20కి పైగా అంతర్జాతీయ గమ్యస్థానాలను కలుపుతోంది.

Exit mobile version