Indigo: పాకిస్తాన్ కు వెళ్లిన ఇండిగో ఎయిర్ లైన్స్ విమానం.. ఎందుకో తెలుసా?

సాధారణంగా విమానాలు గాల్లో ప్రయాణిస్తున్నప్పుడు కొన్ని కొన్ని సార్లు ఎమర్జెన్సీగా చేరుకోవాల్సిన ప్రదేశానికంటే ముందుగానే ల్యాండ్ చేస్తుంటారు.

  • Written By:
  • Publish Date - June 11, 2023 / 06:34 PM IST

సాధారణంగా విమానాలు గాల్లో ప్రయాణిస్తున్నప్పుడు కొన్ని కొన్ని సార్లు ఎమర్జెన్సీగా చేరుకోవాల్సిన ప్రదేశానికంటే ముందుగానే ల్యాండ్ చేస్తుంటారు. టెక్నికల్ ఇష్యూస్ అలాగే వివిధ కారణాల వల్ల కొన్ని కొన్ని సార్లు విమానాలను ఇతర దేశాలలో కూడా ఎమర్జెన్సీ లాండింగ్ చేస్తూ ఉంటారు. అలా తాజాగా కూడా ఇండిగో ఎయిర్ లైన్స్ విమానాన్ని అనుకోకుండా పాకిస్తాన్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఎయిర్ లైన్స్ విమానాన్ని ఎందుకు పాకిస్తాన్ లో ల్యాండింగ్ చేశారు. అసలు ఏం జరిగింది?అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

అమృతసర్ నుంచి అహ్మదాబాద్ కు వెళ్లే ఇండిగో ఎయిర్లైన్స్ విమానం పాకిస్తాన్ లోకి వెళ్ళింది. ప్రతికూల వాతావరణం కారణంగా లాహోర్ వరకు వెళ్లి తిరిగి భారత భూభాగం కి చేరుకుంది. భారత గగనతలంలోకి వచ్చే ముందు పాకిస్తాన్ లోని గుజ్రాన్ వాలా వెళ్లినట్లు పాక్ తెలిపింది. 454 నాట్ల వేగంతో భారత విమానం శనివారం రాత్రి 7:30 లకు లాహోర్ కు ఉత్తర దిశగా ప్రవేశించి రాత్రి 8:01 కు వెళ్లినట్లు అక్కడి డాన్ వార్తా పత్రిక తెలిపింది. అంత బాగానే ఉంది కానీ ఈ విషయంపై విమానయాన సంస్థ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. కాగా ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్ సైట్ ల ప్రకారం..

రాత్రి 7:45 లకు అమృత్ సర్ నుంచి టెకాఫ్ అయిన వెంటనే విమానం దాని మార్గం నుండి తప్పుకుంది. దాంతో ఇండిగో విమానం గుజ్రాన్ వాలా మీదుగా ప్రయాణించి పంజాబ్ లోని శ్రీ ముక్త్స్ర్ సాహిబ్ నగరానికి సమీపంలో భారత గగనతలానికి తిరిగి చేరుకుంది. బ్యాడ్ వెదర్ కారణంగా ఈ విధంగా జరిగింది. ప్రతికూల పరిస్థితులలో ఇలా వేరే దేశ భూభాగంలోకి వెళ్లేందుకు అంతర్జాతీయంగా అనుమతించబడిందని ఇది సర్వసాధారణమే అని సివిల్ ఏవియేషన్ అధికారులు వెల్లడించారు.