Site icon HashtagU Telugu

Fathima Beevi: సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి మృతి

Fathima Beevi

Fathima Beevi

Fathima Beevi: సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి జస్టిస్ ఫాతిమా బీవీ ఈ రోజు గురువారం కన్నుమూశారు. 96 ఏళ్ల జస్టిస్ ఫాతిమా బేవీ కొల్లాంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. న్యాయవ్యవస్థలో వివిధ స్థాయిల్లో పనిచేసిన జస్టిస్ ఫాతిమా బీవీ 1989లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. రెండేళ్లపాటు ఆ పదవిలో కొనసాగిన ఆమె 1992లో పదవీ విరమణ చేశారు. ఇంతకుముందు ఆదాయపు పన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్‌లో జ్యుడీషియల్ మెంబర్‌గా కూడా పనిచేశారు. అంతేకాదు ముస్లిం కమ్యూనిటీ నుంచి గవర్నర్‌గా నియమితులైన తొలి మహిళ కూడా ఈమె.

జస్టిస్ ఫాతిమా బీవీ తన సొంత రాష్ట్రం కేరళలోని పతనంతిట్టలో నివసిస్తున్నారు. తిరువనంతపురంలో బీఎస్సీ పూర్తి చేశారు. అనంతరం తిరువనంతపురంలోని ప్రభుత్వ న్యాయ కళాశాలలో బీఎల్ పట్టా పొంది 1950లో న్యాయవాదిగా బార్ కౌన్సిల్ లో పేరు నమోదు చేసుకుని సెషన్స్ కోర్టులో న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించారు. అంచెలంచెలుగా ఎదిగి 1983లో హైకోర్టు న్యాయమూర్తిగా.. 1989లో సుప్రీంకోర్టులో తొలి మహిళా న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 29 ఏప్రిల్ 1992న ఫాతిమా బీవీ పదవీ విరమణ పొందారు.

Also Read: Uttarkashi Tunnel: సొరంగంలో చిక్కుకున్న కార్మికుల కోసం 40 అంబులెన్స్‌లు