Site icon HashtagU Telugu

India : ఇండియాలో ఫ‌స్ట్ పీడియాట్రిక్ కాలేయ మార్పిడి చేసిన వ్య‌క్తి ..ఇప్పుడు డాక్ట‌ర్‌గా..!

Sanjay Imresizer

Sanjay Imresizer

దేశంలో మొట్ట‌మొద‌టి పిడియాట్రిక్ కాలేయ మార్పిడి చేసిన వ్య‌క్తి ఇప్పుడు డాక్ట‌ర్ అయ్యాడు. నవంబర్ 15, 1998న, కాంచీపురానికి చెందిన ఏడాదిన్నర వయస్సు గల సంజయ్ శక్తి కందస్వామికి.. భారతదేశపు మొట్టమొదటి విజయవంతమైన పీడియాట్రిక్ కాలేయ మార్పిడి జ‌రిగింది. సరిగ్గా 24 ఏళ్ల తర్వాత, సంజయ్ ఇప్పుడు బెంగళూరులో డాక్టర్ గా త‌న జీవితాన్ని ప్రారంభించాడు. చిన్నప్పటి నుండి తాను ఎల్లప్పుడూ వైద్య విజ్ఞాన రంగంలో ఉండాలని కోరుకున్నానని డాక్టర్ కందస్వామి తెలిపారు. 1997లో బిలియరీ అట్రేసియా అనే అరుదైన కాలేయ రుగ్మతతో జన్మించాడు. దీని ఫలితంగా ప్రసవానంతర కామెర్లు వచ్చాయి. ఇది కాలేయ వైఫల్యానికి కారణమైంది, ఇది మార్పిడి అవసరానికి దారితీసింది. ఢిల్లీలోని అపోలో హాస్పిటల్స్‌లో డాక్టర్ ఎంఆర్ రాజశేఖర్, డాక్టర్ ఏవీ సోయిన్ మరియు డాక్టర్ అనుపమ్ సిబల్ ఈ మార్పిడిని నిర్వహించారు.