“కృష్ణ బిలం”.. అదేనండీ ” బ్లాక్ హోల్” పై పరిశోధనల్లో భారత శాస్త్రవేత్తలు కీలక పురోగతి సాధించారు. బ్లాక్ హోల్ పుట్టుక ఎలా జరుగుతుంది ? అనే మిస్టరీకి సంబంధించిన దృశ్యాలను 500వ వంతు టైం స్కేల్ లో మనవాళ్ళు ఒడిసిపట్టారు. ఇందుకోసం ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) కు చెందిన అంతరిక్ష టెలిస్కోప్ “ఆస్ట్రో స్యాట్” ను వినియోగించారు.
2015 నుంచే అంతరిక్ష పరిశోధనలకు వినియోగిస్తున్న ఈ టెలిస్కోప్ లో క్యాడ్మియం జింక్ టెల్యూ రైడ్ ఇమేజర్ (Czti) అనే పరికరం ఉంది. ఇదే బ్లాక్ హోల్ పుట్టుక కు సంబంధించిన దృశ్యాలను 500వ వంతు టైం స్కేల్ లో Czti చిత్రీకరించింది. ఏదైనా నక్షత్రం అంతరించిపోయే స్థితి కి చేరుకున్నప్పుడు .. అందులో గామా రే పేలుళ్లు జరుగుతాయి. వీటిని “మినీ బిగ్ బ్యాంగ్స్” అని కూడా పిలుస్తారు. ఈ పేలుళ్లు జరిగిన తర్వాతే నక్షత్రం అనేది బ్లాక్ హోల్ గా మారే ప్రక్రియ మొదలు అవుతుంది. “ఆస్ట్రో స్యాట్” టెలిస్కోప్ లోని Czti పరికరం గామా రే పేలుళ్ల దృశ్యాలను దిగ్బంధించి, వాటిని విశ్లేషించింది.
దీంతో 500వ వంతు సమయంలో బ్లాక్ హోల్ పుట్టుకకు సంబంధించిన ఊహా చిత్రాలను శాస్త్రవేత్తలు రూపొందిం చగలిగారు. నాసాకు చెందిన నీల్ గెహ్ రెల్స్ స్విఫ్ట్ టెలిస్కోప్ లో కానీ, అమెరికా-ఐరోపా కు చెందిన ఫెర్మీ స్పేస్ టెలిస్కోప్ లో కానీ Czti సంబంధిత పరిజ్ఞానం లేదు. దీన్ని అభివృద్ధి చేసిన ఘనత మన ఇస్రో కే దక్కుతుంది.