Site icon HashtagU Telugu

Air Pollution : ప్ర‌మాద‌క‌ర కాలుష్యంలో 132 సిటీలు

Air Pollution

Air Pollution

దేశంలోని 132 న‌గ‌రాల్లో ప్ర‌మాణాల కంటే దారుణంగా పొల్యూష‌న్ విలువ ప‌డిపోయింది. ఆ విష‌యాన్ని సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ నివేదిక తేల్చింది. పొల్యూష‌న్ ప్ర‌మాణాల కంటే ఎక్కువ‌గా ఉన్న న‌గ‌రాలు 2019లో 102 ఉండ‌గా ఆ సంఖ్య ప్ర‌స్తుతం 132కు చేరింది.డ‌బ్ల్యూహెచ్ వో ప్ర‌మాణాల కంటే త‌క్కువ‌గా వాయు నాణ్య‌త ఉన్న ప్రాంతాల్లో 90 శాతం భార‌త జ‌నాభా నివ‌సిస్తోంది. బొగ్గు ఆధారిత పవర్ ప్లాంట్లు, ఫ్యాక్టరీలు, వాహనాలు కాలుష్యం ప్రధానంగా గాలి నాణ్యతను దెబ్బ‌తింటోంది. చమురు శుద్ధి కర్మాగారాలకు మెటల్ స్మెల్టర్‌లతో సహా పరిశ్రమలకు కఠినమైన ఉద్గారాల ప్రమాణాలు లేకపోవడం, పర్యవేక్షణ స్టేషన్‌లను జోడించడంలో పురోగతి లేక‌పోవ‌డం గాలి నాణ్యతను భార‌త్‌ కాపాడుకోలేక పోతోంది. సాధారణంగా రాజధాని న్యూఢిల్లీతో సహా ఉత్తరాది నగరాలను ఉక్కిరిబిక్కిరి చేసే పొగమంచు కప్పివేస్తుంది. కాలుష్య ప్రమాదాలను పరిష్కరించడంలో పురోగతి లేని కార‌ణంగా సుమార 1.67 మిలియన్ల మంది మరణించారు. 2019లో కాలుష్యంతో కూడిన గాలి ఫలితంగా దేశ ఆర్థిక వ్యవస్థపై ప్ర‌భావం ప‌డింది. కాలుష్యం కార‌ణంగా వ్యాపార గమ్యస్థానం నుంచి భార‌త్ ప‌క్క‌దోవ ప‌డుతోంది.
కాలుష్య ప్రమాణాలను అమలు చేయడానికి పవర్ ప్లాంట్ల గడువును పొడిగించినందుకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం గతంలో విమర్శలను ఎదుర్కొంది. దేశంలోని 70% విద్యుత్‌ను ఉత్పత్తి చేసే బొగ్గు వినియోగాన్ని తగ్గించడానికి ఇంకా ల‌క్ష్యాన్ని నిర్దేశించుకోలేదు. ఫ‌లితంగా కాలుష్యంతో కూడిన భార‌త్ కు భ‌విష్య‌త్ ప్రమాద‌క‌రం కానుంది.