Youtuber: టర్కీలో ఓ భారతీయ యూట్యూబర్ అరెస్ట్ చేయబడినట్టు సమాచారం, అతని వివాదాస్పద వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ‘‘మాలిక్ స్వాష్‌బక్లర్’’ అనే పేరుతో పాపులరైన మాలిక్ ఎస్‌డీ ఖాన్ టర్కిష్ మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఆరోపణలపై టర్కీ పోలీసులచే అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. మాలిక్ తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా టర్కీలో పర్యటిస్తూ వివిధ వీడియోలు విడుదల చేస్తూ ఉండగా, కొన్ని క్లిప్‌ల్లో మహిళలపై లైంగిక వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు వెలుగు చూశాయి. కొన్ని వీడియోల్లో అతను హిందీలో తీవ్ర అసభ్య భాషను ఉపయోగించినట్టు తేలింది. ‘‘మాల్’’ అంటూ టర్కిష్ మహిళల్ని పేర్కొనడం, గైడ్‌ను లైంగికంగా వేధించాలా అని అభ్యంతరకరంగా అడిగిన తీరు తీవ్ర విమర్శలకు దారితీసింది.
Shocking : మహిళా సెక్స్ వర్కర్లలో టాప్ 5లో తెలుగు రాష్ట్రాలు.. ఏపీ రెండో స్థానం.. తెలంగాణ…?
ఈ ఆరోపణల నేపథ్యంలో మాలిక్ తన సోషల్ మీడియా అకౌంట్ల నుంచి సంబంధిత వీడియోలను తొలగించినప్పటికీ, కొన్ని వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాటిని అనువదించిన స్థానిక యూజర్లు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేశారు. టర్కీ ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై స్పందించిన పోలీసు అధికారులు మాలిక్‌ను అదుపులోకి తీసుకున్నట్లు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే, ఈ అరెస్ట్‌పై అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన టర్కీ ప్రభుత్వ ఆధీనంలో నుండి వెలువడలేదు.
ఈ ఘటన భారత-టర్కీ సంబంధాల నేపథ్యంలో కీలకంగా మారింది. ఇటీవల కాశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడి, ఆ తర్వాత ఆపరేషన్ సిందూర్ సందర్భంగా పాకిస్తాన్-టర్కీ డ్రోన్ల సహకారం వంటి అంశాల నేపథ్యంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇటువంటి సమయంలో భారతీయ పర్యాటకులపై టర్కీలో జరిగిన ఈ అరెస్ట్ భారతీయుల్ని ఆందోళనకు గురి చేసింది. ఇప్పటికే పలువురు భారతీయులు టర్కీ పర్యటనలను బహిష్కరిస్తున్నట్టు సోషల్ మీడియాలో స్పందనలు వస్తున్నాయి.