Angkita Dutta: పార్టీనేతపై సంచలన ఆరోపణలు చేసిన అంగ్ కిత్ దత్తా.. ఆరు నెలల నుంచి వేధిస్తున్నాడంటూ?

తాజాగా అసోం యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు అంగ్ కితా దత్తా పార్టీ నేత పై సంచలను ఆరోపణలు చేసింది. తనని

  • Written By:
  • Publish Date - April 19, 2023 / 06:29 PM IST

తాజాగా అసోం యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు అంగ్ కితా దత్తా పార్టీ నేత పై సంచలను ఆరోపణలు చేసింది. తనని కాంగ్రెస్ యూత్ వింగ్ అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్ ఆరు నెలల నుంచి వేధిస్తున్నాడు అంటూ ఆరోపణలు చేసింది. ఏం మందు తాగుతావు?వోడ్కానా?టకీలానా అంటూ ఆయన తనకు మెసేజ్ లు పంపినట్లుకూడా ఆమె తెలిపింది. తాజాగా ఆమె ఒక జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది. కాంగ్రెస్ అసోం కార్యదర్శి వర్ధన్ యాదవ్ ద్వారా కూడా శ్రీనివాస్ తనను అవమానించారని ఆమె తెలిపింది.

తన గురించి చులకనగా కూడా మాట్లాడే వారని ఆమె చెప్పుకొచ్చింది. వర్ధన్ కు అవినీతి చరిత్ర ఉందని ఒక కేసులో జైలుకు కూడా వెళ్ళొచ్చాడు అనే ఆమె ఆరోపించింది. అయినా కూడా అతనికి ఆ పదవి ఎలా ఇచ్చారు అన్నది తనకు అర్థం కావడం లేదని ఆమె ప్రశ్నించింది. తనతో అమర్యాదగా ప్రవర్తించిన విషయాన్ని బీబీ శ్రీనివాస్ కు చెప్తే వర్ధనపై ఎటువంటి చర్యలు తీసుకోకపోగా శ్రీనివాస్ సైతం తనకు అభ్యంతర మెసేజ్లు చేశాడని ఆమె తెలిపింది. రోజురోజుకి శ్రీనివాస్ వేధింపులు ఎక్కువ అవుతున్నాయని ఆయన గురించి భారత జూడో యాత్రలో రాహుల్ గాంధీ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు ఆమె చెప్పుకొచ్చింది.

మహిళల సంరక్షణ గురించి మాట్లాడే రాహుల్ గాంధీ శ్రీనివాస్ పై ఇప్పటివరకు ఇటువంటి చర్యలు ఎందుకు తీసుకోలేదు అని ఆమె ప్రశ్నించింది. ఒక మహిళకు ఇటువంటి వేధింపులు ఎదురవుతున్నప్పుడు తాను మహిళల్ని కాంగ్రెస్ పార్టీలో ఎలా చేరమని చెప్పాలి అని ఆమె నిలదీసింది. అంతేకాకుండా శ్రీనివాస్ ఆరు నెలలుగా మానసికంగా వేధిస్తున్న వివక్షత చూపుతున్న కూడా తననే మౌనంగా ఉండమని చెబుతున్నారని శ్రీనివాస్ పై ఎటువంటి విచారణ ప్రారంభించలేదు అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. శ్రీనివాస్ పై చర్యలు తీసుకుంటారని తాను నెలల తరబడిగా మౌనంగా వేచి చూస్తున్నా కూడా ఎవరు చర్యలు తీసుకోవడం లేదని ఆమె అసహనం వ్యక్తం చేసింది. వి ఆర్ ఓ ముసుగులో ఆయన ఎన్నో తప్పుడు పనులకు కూడా పాల్పడుతున్నట్లు ఆమె ఆరోపించింది.