Site icon HashtagU Telugu

Spacex Moon Trip: భారతీయ నటుడికి అరుదైన అవకాశం.. అంతరిక్షంలోకి అడుగుపెట్టనున్న యాక్టర్‌ ఎవరంటే?

Spacex

Spacex

Spacex Moon Trip: అంతరిక్షంలో మరో అద్భుతం సృష్టించేందుకు ఎలన్‌ మస్క్‌ సిద్ధమవుతున్నాడు. 2023లో 8 మందిని నింగిలోకి పంపనున్నాడు ప్రపంచ కుబేరుడు మస్క్‌. ఈ ఎనిమిది మంది ఎవరనే దానిపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ జాబితా ఇటీవలే బయటకు వచ్చింది. జపాన్‌కు చెందిన బిలియనీర్‌ యుసాకు మాయఝావా ఈ మేరకు ఆ ఎనిమిది మంది వివరాలు వెల్లడించారు.

ఆయన మూన్‌ ట్రిప్‌ కోసం స్పేస్‌ ఎక్స్‌కు చెందిన స్పేస్‌ షిప్‌ స్పేస్‌ క్రాఫ్ట్‌ సీట్లు కొనుగోలు చేశారు. మరోవైపు అంతరిక్షంలోకి వెళ్లే ఆ ఎనిమిది మందిలో ఓ భారతీయ నటుడు కూడా ఉండటం ఇప్పుడు ఆసక్తి పెంచుతోంది. జపాన్‌ను చెందిన బిలియనీర్‌ యుసాకు మేజావా.. ట్విట్టర్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటారు. 2020 జనవరి 1న మేజావా చేసిన ఓ ట్వీట్‌ను ఎవరైతే ఎక్కువ సార్లు రీట్వీట్‌ చేస్తారో.. వారిలో 1,000 మందిని ఎంపిక చేసి 1 మిలియన్ యెన్ చెల్లిస్తానని సంచలన ప్రకటన చేశారు.

ఈ క్రమంలో ప్రయోగాలు చేస్తూ.. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఎనిమిది మందిని ఎంపిక చేసి వారిని ఫ్రీగా చంద్రునిపైకి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. 2023లో ఈ యాత్ర ప్రారంభం కానుంది. డియర్‌ మూన్‌ క్రూ అని దీనికి నామకరణం చేశారు. ఈ ప్రయాణం ఆరు రోజులపాటు ఉంటుంది. ఇందులో మూడు రోజుల పాటు చంద్రుడి చుట్టూ తిరిగి భూమి మీదికి చేరుకోనున్నారు.

నింగిలోకి వెళ్లేది వీరే..

ఇక ఎనిమిది మంది ఎవరనే విషయానికి వస్తే.. మన దేశానికి చెందిన నటుడు దేవ్‌ జోషి ఉన్నారు. ఆయనతోపాటు జపనీస్ ఫ్యాషన్.. అమెరికన్ డిజె, నిర్మాత స్టీవ్ అయోకి, యెమి ఎడి, అమెరికన్ యూట్యూబర్ టిమ్ డాడ్, బ్రిటిష్ ఫోటోగ్రాఫర్ కరీం ఇలియా, ఐరిష్ ఫోటోగ్రాఫర్ రియానన్ ఆడమ్, దక్షిణ కొరియా కె-పాప్ బ్యాండ్ స్టార్‌ చోయ్ సెయుంగ్-హ్యూన్, అమెరికన్ చిత్రనిర్మాత బ్రెండన్ హాల్ ఉన్నారు.

Exit mobile version