Site icon HashtagU Telugu

Team India: సఫారీ సిరీస్ కు ‘సీనియర్ల’కు రెస్ట్!

Kohli Rohit Sharma

Kohli Rohit Sharma

ఐపీఎల్ 2022 సీజన్ ముగిశాక స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరగాల్సిన టీ20 సిరీస్‌కు ఐపీఎల్ ఫైనల్ రోజున భారత జట్టును ఎంపిక చేయనున్నారు. భారత్‌-దక్షిణాఫ్రికా జట్ల మధ్య టీ20 సిరీస్‌ జూన్‌ 9 నుంచి ప్రారంభంకానుంది. ఐదు మ్యాచ్‌ల ఈ టీ20 సిరీస్‌ జూన్‌ 19 వరకు జరుగనుంది. అయితే ఈ సిరీస్‌కు పలువురు సీనియర్‌ విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. విరాట్ కోహ్లితో పాటుగా రోహిత్‌ శర్మ, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, కేఎల్‌ రాహుల్‌, మహ్మద్‌ షమీలకు రెస్ట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కీలక ఆటగాళ్లు జట్టుకు దూరమవడంతో సీనియర్ ఓపెనర్ శిఖర్‌ ధావన్‌ మరో ససారి సారథిగా వ్యవహరించే అవకాశం ఉంది. అయితే ఈ సిరీస్ కు ఐపీఎల్‌లో మెరుగైన ప్రదర్శన చేస్తున్న పలువురు ఆటగాళ్లు ఎంపికయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టి20 ప్రపంచకప్‌ కోసం ఈ సిరీస్‌ లో యువ ఆటగాళ్లను పరీక్షించే అవకాశముంది. ఈ సిరీస్ కు ఐపీఎల్ లో అదరగొడుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్, పంజాబ్ కింగ్స్ తరఫున రాణిస్తున్న అర్షదీప్ సింగ్ , లక్నో సూపర్ జెయింట్స్ తరఫున అదరగొడుతున్న ఆయుష్ బదాని, రాజస్థాన్ రాయల్స్ కీలక బావెర్ ప్రసిద్ కృష్ణ, ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెన్ పృథ్వీ షా ఎంపికయ్యే అవకాశముంది. ఇక టీమిండియా-సౌతాఫ్రికా మధ్య ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ షెడ్యూల్‌ విషయానికొస్తే.. తొలి టి20- జూన్‌ 9న ఢిల్లీ వేదికగా జరగనుండగా.. రెండో టి20 మ్యాచ్ జూన్‌ 12న కటక్‌ వేదికగా, మూడో టి20 మ్యాచ్ జూన్‌ 14న విశాఖపట్నం వేదికగా, నాలుగో టి20మ్యాచ్ జూన్‌ 17న రాజ్‌కోట్‌ వేదికగా ఐదో టి20 మ్యాచ్ జూన్‌ 19న బెంగళూరు వేదికగా జరగనుంది.