Australia: 11 సార్లు పొడిచి భారతీయ విద్యార్థినిని అతి కిరాతకంగా చంపిన కిరాతకుడు?

ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థి శుభమ్ గార్గ్ కత్తిపొట్లకు గురైన విషయం తెలిసిందే. ప్రస్తుతం శుభం ఆస్పత్రిలో చికిత్స

  • Written By:
  • Publish Date - October 14, 2022 / 05:12 PM IST

ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థి శుభమ్ గార్గ్ కత్తిపొట్లకు గురైన విషయం తెలిసిందే. ప్రస్తుతం శుభం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా ఈ ఘటనపై అతని తల్లిదండ్రులు స్పందిస్తూ జాతి విద్వేషమే కారణం అంటూ ఆరోపిస్తున్నారు. ఆగ్రాకు చెందిన శుభమ్ సిడ్నీలోని న్యూ సౌత్ వేల్స్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేస్తున్నాడు. ఈ నెల అక్టోబరు 6న అతడి పై దుండగులు దాడి చేసి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 11 సార్లు కత్తితో దారుణంగా అత్యంత కిరాతకంగా పొడిచారు. కాగా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శుభమ్ గార్గ్ పరిస్థితి విషమంగా ఉందని అతని కుటుంబసభ్యులు తెలిపారు.

అయితే తమ బిడ్డ దగ్గరకు వెళ్లేందుకు గత ఏడు రోజులుగా ఆస్ట్రేలియా వీసా కోసం ప్రయత్నిస్తున్నామని, కానీ దొరకడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు దుండగులు అతనికిరాతకంగా పొడవడంతో అతని శుభమ్ ముఖం, ఛాతీ, పొత్తికడుపు పై తీవ్రగాయాలయ్యాయి. దాడికి పాల్పడిన అనుమానితుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. అతడి పై హత్యాయత్నం కింద అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. శుభమ్ తండ్రి రామ్‌నివాస్ గార్గ్ ఈ విషయంపై. దాడిచేసిన వ్యక్తి ఎవరో తమకుగానీ, శుభమ్‌కు గానీ తెలియదని తన కొడుకు స్నేహితులు ధ్రువీకరించారని అన్నారు.

అలాగే ఇది జాతి విద్వేష పూరిత దాడిగా అనిపిస్తోందని వారి అభిప్రాయం వ్యక్తం చేశారు. మాకు సహాయం చేయమని భారత ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాం అని వారు తెలిపారు.దీనిపై ఆగ్రా జిల్లా మేజిస్ట్రేట్ నవనీత్ చాహల్ స్పందిస్తూ..బాధితుడి సోదరుడి వీసా దరఖాస్తు ప్రక్రియలో ఉంది.. విదేశాంగ శాఖతో సమన్వయం చేస్తున్నాం. సిడ్నీలోని ఎంబసీ అధికారులతో కూడా మాట్లాడాను.. వీసా త్వరలో వస్తుందని తెలిపారు.