Russia Ukraine War: ఉక్రెయిన్‌లో భార‌త విద్యార్ధి మృతి…!

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఆరో రోజు కూడా కొనసాగుతోంది, ఉక్రెయిన్‌లోని రెండో అతి పెద్ద నగరం ఖార్కివ్‌పై రష్యా సైనికులు బ‌ల‌గాలు జ‌రిపిన క్షిపిణి దాడిలో భారత విద్యార్ధి నవీన్ మృతి చెందినట్లు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరీందమ్ బాగ్చి ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. నవీన్ తన అపార్ట్మెంట్ నుండి రైల్వే స్టేషన్ వైపు వెళుతుండగా దురదృష్టవశాత్తు క్షిపణి దాడిలో మరణించాడని పేర్కొన్నారు. కర్నాటకకు చెందిన నవీన్ […]

Published By: HashtagU Telugu Desk
Ukraine , Russia War India Student

Ukraine , Russia War India Student

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఆరో రోజు కూడా కొనసాగుతోంది, ఉక్రెయిన్‌లోని రెండో అతి పెద్ద నగరం ఖార్కివ్‌పై రష్యా సైనికులు బ‌ల‌గాలు జ‌రిపిన క్షిపిణి దాడిలో భారత విద్యార్ధి నవీన్ మృతి చెందినట్లు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరీందమ్ బాగ్చి ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. నవీన్ తన అపార్ట్మెంట్ నుండి రైల్వే స్టేషన్ వైపు వెళుతుండగా దురదృష్టవశాత్తు క్షిపణి దాడిలో మరణించాడని పేర్కొన్నారు. కర్నాటకకు చెందిన నవీన్ ఉక్రెయిన్‌లోని ఖార్కివ్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీలో మెడిసిన్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు.

  Last Updated: 01 Mar 2022, 03:51 PM IST