Tea@Train: ఒక్క టీకు రూ.70 వసులు చేసిన ఇండియన్ రైల్వే.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

సాధారణంగా ఒక టీ 10 లేదా 12 రూపాయలు ఇంకా లేదంటే కొన్ని రైళ్లు 20 రూపాయల వరకు ఉంటుంది.

  • Written By:
  • Publish Date - July 1, 2022 / 06:30 PM IST

సాధారణంగా ఒక టీ 10 లేదా 12 రూపాయలు ఇంకా లేదంటే కొన్ని రైళ్లు 20 రూపాయల వరకు ఉంటుంది. కానీ ఒక ప్రయాణికుడు ఒక కప్పు టీ కి దాదాపుగా 70 రూపాయల వరకు చెల్లించాడట. అందుకు సంబంధించిన బిల్ పేపర్ ను తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆఫ్ బిల్ పేపర్ కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడంతో ఆ విషయంపై రైల్వే అధికారులు స్పందించారు. అసలేం జరిగిందంటే తాజాగా ఒక ప్రయాణికుడు జూన్ 28 ఢిల్లీ గోపాల్ మధ్య నడిచే శతాబ్ది ట్రైన్ లో ఎక్కాడు.

ఆ ప్రయాణికుడు అతని ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేసిన పోస్టులో రెండు టాక్స్ ఇన్వాయిస్ లు ఉన్నాయి. వాటిని చూసిన నెటిజన్స్ అవాక్కవుతున్నారు. అందుకు గల కారణం వాటిలో టీ ధర 20 రూపాయలు ఉండగా సర్వీస్ చార్జెస్ 50 రూపాయలు ఉంది. ఫలితంగా ఒక కప్పు టీ కోసం అతను 70 రూపాయలు చెల్లించాల్సి రావడంతో ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది. ఇకపోతే IRCTC ఇటువంటి కంప్లైంట్లు వస్తూనే ఉంటాయి. ఈ సంస్థ రైళ్లలో క్యాటరింగ్ సర్వీసును అందిస్తోంది. కానీ ఇటువంటి కంప్లైంట్ ను అసంస పట్టించుకోవడం లేదు.

 

అయితే ఎప్పుడైనా వస్తువు ధర కంటే సర్వీస్ ద్వారా తక్కువ ఉంటుంది కానీ ఇక టీ ధర కంటే సర్వీస్ ఛార్జ్ చాలా ఎక్కువగా ఉండడంతో ఆ విషయం నెటిజన్లకు ఆగ్రహం తెప్పిస్తోంది. ఈ విషయంపై రైల్వే అధికారులు స్పందిస్తూ.. ఈ సర్వీస్ చార్జీలకు సంబంధించిన 2018 లో ఇండియన్ రైల్వేస్ ఒక సరక్యులర్ జారీ చేసింది. అందులో ప్రయాణికులు ట్రైన్ టికెట్ రిజర్వేషన్ చేయించుకునే సమయంలో భోజనం బుక్ చేసుకోకపోతే రాజధాని శతాబ్ది వంటి రైల్లలో సర్వీస్ రూ.50 ఛార్జీ పడుతుంది. అంటే రైలు ఎక్కిన తర్వాత ప్రయాణికులు భోజనం కానీ స్నాక్స్ గాని టీ కాఫీ ఏదైనా కావాలి అనుకున్న వాటి తరువాత పాటుగా సర్వీస్ ఛార్జ్ కింద అదనంగా 50 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ విషయం తెలియని ఆ ప్రయాణికుడు టీకి 70 రూపాయలు చెల్లించాడు.