Site icon HashtagU Telugu

Indian Railways : “ఆపరేషన్ నన్హే ఫరిష్టే”.. తప్పిపోయిన పిల్లల జాడ కోసం..!

Railway Police Imresizer

Railway Police Imresizer

తప్పిపోయిన పిల్లలను గుర్తించడానికి, పిల్లల అక్రమ రవాణాను నిరోధించడానికి భారతీయ రైల్వే (ఐఆర్) ‘ఆపరేషన్ నన్హే ఫరిష్టే’ అనే ఇంటెన్సివ్ డ్రైవ్‌ను ప్రారంభించింది. రైల్వే ప్రాపర్టీలను, ప్రయాణికులను రక్షించేందుకు, రైల్వే ప్రాంతాల్లో నిరాశ్రయులైన చిన్నారులతో పాటు మహిళలు, పిల్లల అక్రమ రవాణాను అరికట్టేందుకు నేరగాళ్లపై రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్) అలుపెరగని పోరాటం చేస్తుందని డబ్ల్యూఆర్‌ చీఫ్‌ స్పోక్స్‌పర్సన్‌ సుమిత్‌ ఠాకూర్‌ తెలిపారు. గత ఏడాది (2022)లో 17,750 మంది చిన్నారులను రైల్వే ఆస్తుల నుంచి ఆర్‌పిఎఫ్ రక్షించిందని, ‘ఆపరేషన్ నాన్హే ఫరిష్టే’ అద్భుతమైన ఫలితాలను చూపుతోందని ఠాకూర్ చెప్పారు. www.indianrailways.govలోని ట్రాక్ చైల్డ్ పోర్టల్-3.0లో అప్‌లోడ్ చేయబడుతున్న – తప్పిపోయిన లేదా వివిధ కారణాల వల్ల వారి కుటుంబాల నుండి విడిపోయిన పిల్లల పూర్తి సమాచారం వివరాలను వెబ్‌సైట్‌లో ఉన్నాయ‌ని తెలిపారు.