Indian Railways : వృద్ధులకు రాయితీ పునరుద్ధరించనున్న భారతీయ రైల్వే.. కొత్త షరతులు ఇవే?

కరోనా విజృంభిస్తున్న సమయంలో భారతీయ రైల్వే వృద్ధుల పట్ల సంచలన నిర్ణయం తీసుకుంది ఈ క్రమంలోని వృద్ధులకు ఇస్తున్న రాయితీలను

  • Written By:
  • Publish Date - July 28, 2022 / 06:00 PM IST

కరోనా విజృంభిస్తున్న సమయంలో భారతీయ రైల్వే సంచలన నిర్ణయం తీసుకుంది ఈ క్రమంలో వృద్ధులకు ఇస్తున్న రాయితీలను నిలిపివేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే ప్రస్తుతం కరోనా కేసులు తగ్గిన నేపథ్యంలో తిరిగి వృద్ధులకు రైలు ప్రయాణంలో రాయితీలు పునరుద్ధరించనున్నట్లు భారతీయ రైల్వే సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే బుధవారం నిర్వహించిన పార్లమెంటు సమావేశాలలో భాగంగా రైళ్లలో వృద్ధులకు అందిస్తున్న రాయితీలను పునరుద్ధరించినన్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

అయితే, గతంలో వృద్ధుల‌కు రాయితీలు ఇవ్వ‌డానికి ఉన్న నిబంధ‌న‌ల్లో మార్పులు చేసిన‌ట్టు కేంద్ర‌ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. గతంలో 58 సంవత్సరాలు నిండిన వృద్ధులకు మాత్ర‌మే ల‌భించిన రాయితీని మ‌రింత పెంచిన‌ట్టు తెలిపింది. ఈ క్రమంలోనే 70 సంవత్సరాలు పైబడిన వృద్ధులు రైలులో ప్రయాణం చేసేటప్పుడు వారికి రాయితీ లభిస్తుందని భారతీయ రైల్వే తెలిపింది. త్వరలోనే ఈ నిబంధనలు అమలలోకి రానున్నట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సమావేశాలలో భాగంగా వెల్ల‌డించింది.