Site icon HashtagU Telugu

Moon To Mars : చంద్రుడి నుంచి మార్స్ పైకి మిషన్.. నాసా టీమ్ కు ఇండియన్ సారథ్యం

Moon To Mars

Moon To Mars

Moon To Mars : నాసాలో మరో కీలక అవకాశం భారతీయుడికి దక్కింది. ఆ ఛాన్స్ ను భారత సంతతికి చెందిన అమిత్ క్షత్రియ దక్కించుకున్నారు. చంద్రుడిపైకి మనిషి వెళ్లడం ఒక ఎత్తు..ఈ ఘట్టాన్ని 1969 జులై 16నే అమెరికా పూర్తి చేసింది..అపోలో మిషన్ ద్వారా చంద్రుడిపై మనిషి ఆనాడే దిగాడు.. ఇప్పుడు చంద్రుడిపై స్థావరాన్ని ఏర్పాటు చేసి.. అక్కడి నుంచి అంగారకుడిపైకి వెళ్లేందుకు అమెరికా స్కెచ్ గీస్తోంది. దీనికి సంబంధించిన ఇటీవల నాసా ప్రత్యేక విభాగం ఒకటి ఏర్పాటు చేసింది. దీనికి సారథ్యం వహిస్తున్నది ఎవరో తెలుసా ? భారత సంతతికి చెందిన సాఫ్ట్ వేర్, రోబోటిక్ వ్యవహారాల ఇంజనీరింగ్ నిపుణుడు అమిత్ క్షత్రియ. ఆయనను ‘మూన్ టు మార్స్’ మిషన్ కు హెడ్ గా నియమిస్తూ నాసా నిర్ణయం తీసుకుంది. అమిత్ క్షత్రియ విస్కాన్సిన్‌లోని బ్రూక్‌ఫీల్డ్‌లో జన్మించారు.

Also read : Windfall Tax: ముడి చమురుపై విండ్ ఫాల్ పన్ను తగ్గింపు

కాలిఫోర్నియాలోని పసాదేనాలో ఉన్న కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి గణితశాస్త్రంలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ , ఆస్టిన్‌లోని టెక్సాస్ విశ్వవిద్యాలయం నుంచి గణితశాస్త్రంలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్‌ కోర్సులు చేశారు. అమిత్ క్షత్రియ  2003లో అంతరిక్ష కార్యక్రమంలో తన వృత్తిని ప్రారంభించాడు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా, రోబోటిక్స్ ఇంజనీర్‌గా, స్పేస్‌క్రాఫ్ట్ ఆపరేటర్‌గా నాసాకు సేవలు అందిస్తున్నారు. ప్రధానంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) యొక్క రోబోటిక్ అసెంబ్లీపై ప్రస్తుతం ఆయన దృష్టి సారించారు. ఇకపై ‘మూన్ టు మార్స్’ మిషన్ కు హెడ్ గా చంద్రుడి నుంచి అంగారక గ్రహానికి మానవ మిషన్లను ఎలా ప్లాన్ చేయాలి ? వాటి అమలు ఎలా ? అనే దానిపై అమిత్  ఫోకస్  పెట్టనున్నారు.

Exit mobile version