Indian Navy: ప‌రీక్ష లేకుండానే జాబ్‌.. ల‌క్ష‌ల్లో జీతం..!

ఇండియన్ నేవీ (Indian Navy) షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో SSC అధికారుల 254 ఖాళీలను భర్తీ చేస్తారు.

  • Written By:
  • Updated On - March 4, 2024 / 09:35 AM IST

Indian Navy: ఇండియన్ నేవీ (Indian Navy) షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో SSC అధికారుల 254 ఖాళీలను భర్తీ చేస్తారు. అభ్యర్థులు నేవీ joinindiannavy.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 24 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ మార్చి 10, 2024.

ఈ రిక్రూట్‌మెంట్ కింద జనవరి 2, 2000 తర్వాత జన్మించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. జూలై 1, 2005 తర్వాత జన్మించిన అభ్యర్థులు దరఖాస్తు చేయలేరు. అవివాహిత అభ్యర్థులు మాత్రమే నేవీ SSC రిక్రూట్‌మెంట్ 2024 కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత ప్రమాణాల గురించి మాట్లాడుకుంటే.. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఏదైనా సబ్జెక్టులో B.E./B.Tech డిగ్రీని కలిగి ఉండాలి. లేదా కనీసం 60% మార్కులతో డిగ్రీ స‌ర్టిఫికేట్ ఉండాలి. డిగ్రీలో సాధించిన మార్కుల ఆధారంగా SSB ఇంటర్వ్యూ కోసం షార్ట్‌లిస్ట్ చేయబడతారు.

Also Read: Salt: వాష్ రూమ్ లో తప్పనిసరిగా ఉప్పును ఉంచాలా.. లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా?

దరఖాస్తు ప్రక్రియను తెలుసుకోండిలా..!

– ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ముందుగా నేవీ వెబ్‌సైట్ joinIndiannavy.gov.inకి వెళ్లాలి.
– ఆ తర్వాత మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ లింక్‌పై క్లిక్ చేయాలి.
– మీకు సంబంధించిన సమాచారం అక్క‌డ అడుగుతారు. వివరాలను పూరించిన తర్వాత మరింత కొనసాగండి.
– మీరు అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి.
– ఈ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత రుసుము చెల్లించండి.
– దరఖాస్తును పూర్తిగా నింపిన తర్వాత దరఖాస్తు ఫారమ్‌ను ప్రింట్ తీసుకోండి.

We’re now on WhatsApp : Click to Join

ఖాళీల వివరాలు

ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్: 136 పోస్టులు
ఎడ్యుకేషన్ బ్రాంచ్: 18 పోస్టులు
టెక్నికల్ బ్రాంచ్: 100 పోస్టులు

ఎంపిక ప్రక్రియ ఇలా

దీని కోసం మీరు పరీక్షకు హాజరు కానవసరం లేదు. బదులుగా SSB ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయబడుతుంది. ఎంపిక ప్రక్రియలో అర్హత డిగ్రీలో అభ్యర్థులు పొందిన సాధారణ మార్కుల ఆధారంగా అభ్యర్థుల షార్ట్‌లిస్ట్ ఉంటుంది. షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులకు SSB ఇంటర్వ్యూ కోసం వారి ఎంపిక గురించి ఇ-మెయిల్ లేదా SMS ద్వారా తెలియజేయబడుతుంది.

ఆ తర్వాత వైద్య పరీక్ష ఉంటుంది. తుది ఎంపిక తర్వాత అభ్యర్థులు సబ్ లెఫ్టినెంట్లుగా శిక్షణ పొందవలసి ఉంటుంది. శిక్షణ పూర్తయిన తర్వాత NAICలో మూడేళ్లు, ఇతర శాఖల్లో రెండేళ్లు ప్రొబేషన్‌లో సేవలందించాల్సి ఉంటుంది. దీని తర్వాత శాశ్వత నియామకం ఉంటుంది. జీతం గురించి చెప్పాలంటే.. మీకు ఇతర అలవెన్స్‌లతో పాటు రూ.56100 లభిస్తుంది. స్థాయిల‌ను బ‌ట్టి జీతం ల‌క్ష‌ల్లో ఉంటుంది.