Site icon HashtagU Telugu

Simranjit Shally Singh: ఆ పాడు పని చేయడంతో కెనడాలో భారతీయుడికి 5ఏళ్ళు శిక్ష?

Simranjit Shally Singh

Simranjit Shally Singh

తాజాగా ఒక కెనడాలో ఉన్న ఒక భారతీయుడికి దాదాపు 5 ఏళ్ల జైలు శిక్ష పడింది. మానవ అక్రమ రవాణాకు పాల్పడినట్టు తెలియడంతో అతనికి కోర్టు 5ఏళ్లు జైలు శిక్షను విధించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కెనడాలోని ఒంటారియోలో నివాసం ఉంటున్న సిమ్రాన్ జిత్ షల్లీ సింగ్ అనే 40 ఏళ్ళ భారతీయుడికి ఐదేళ్ల జైలు శిక్ష పడింది. అతను మానవ అక్రమ రవాణాకు పాల్పడినట్టు తేలడంతో అల్బనీలోని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు 250,000 డాలర్లు అనగా మన ఇండియన్ కరెన్సీ ప్రకారం 2 కోట్ల 6 లక్షల జరిమానా విధించింది. సింగ్ మొదటగా ఆరుగురిని, ఆ తర్వాత మరో ముగ్గురిని కెనడా నుంచి అమెరికాకు అక్రమ రవాణా చేసినట్టుగా నేరాన్ని అంగీకరించాడు.

దాంతో యూఎస్ అభ్యర్ధన మేరకు.. 2022 జూన్ 28వ తేదీన సింగ్‌ను కెనడాలో అరెస్టు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా ఈ ఏడాది మార్చి 30న సింగ్‌ని కెనడా నుంచి అమెరికాకు రప్పించారు. 2020 మార్చి, 2021 మార్చి మధ్యలో అతను కొంతమంది భారతీయులను కార్న్‌వాల్ ద్వీపం, సెయింట్ లారెన్స్ నదీ ప్రాంతంలోని అక్వెసన్సే భారత రిజర్వ్ మీదుగా కెనడా నుండి అమెరికాకు అక్రమంగా రవాణా చేసినట్టు విచారణలో తేలింది. సెయింట్ లారెన్స్ నదిలో పడవల ద్వారా మనుషుల్ని అమెరికాకు తరలించే వాడని పోలీసులు తెలిపారు. అయితే గతంలో ఇదే నదిలో నలుగురు భారతీయులు, నలుగురు రోమానియన్ల మృతదేహాలను పోలీసులు గుర్తించారు.

అయితే అప్పుడే ఈ మార్గం గూండా మనుషుల్ని అక్రమంగా రవాణా చేస్తున్నారన్న విషయం వెలుగులోకి వచ్చింది. కెనడా నుంచి యూఎస్‌కి తమ ప్రవేశాన్ని సులభతరం చేసినందుకు గాను సింగ్ తమ వద్ద నుంచి 5వేల నుంచి 35వేల డాలర్ల వరకు వసూలు చేశాడని అమెరికన్ లా ఎన్ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ కొంతమంది అక్రమ వలసదారులు సమర్పించిన డాక్యుమెంట్లలో తేలింది. ఈ నేర ఆరోపణలన్నింటిలో సింగ్ దోషిగా తేలడంతో కోర్టు అతనికి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ శిక్ష 15 ఏళ్ల వరకూ పొడిగించే ఆవకాశముందని కూడా కోర్టు తెలిపింది. అయితే సింగ్ జైలు శిక్ష 2023 డిసెంబర్ 28 నుండి అమల్లోకి వస్తుందని తీర్పునిచ్చింది..

Exit mobile version