India vs Pakistan: దుమ్మురేపిన భారత్ బౌలర్లు, 191 పరుగులకు కుప్పకూలిన పాక్

రోహిత్ నిర్ణయం సరైందేనని నిరూపిస్తూ భాతర బౌలర్లు రెచ్చిపోయారు. దీంతో పాకిస్థాన్ 191 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

Published By: HashtagU Telugu Desk
Team India

Indian Team

India vs Pakistan: వన్డే వరల్డ్ కప్ 2023 మహా సంగ్రామంలో పాకిస్తాన్‌తో భారత్ తలపడుంది. టాస్ గెలిచిన ఇండియా మొదట బౌలింగ్ చేసింది. నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో రోహిత్ బౌలింగ్ ఎంచుకోవడం అందరికీ షాక్ ఇచ్చింది. కానీ పిచ్ బౌలింగ్ అనుకూలించడంతోనే రోహిత్ బౌలింగ్ ను ఎంచుకున్నాడు. రోహిత్ నిర్ణయం సరైందేనని నిరూపిస్తూ భాతర బౌలర్లు రెచ్చిపోయారు. బుమ్రా, పాండ్యా, జడేజా, సిరాజ్, కుల్దీప్ రెచ్చిపోవడంతో పాకిస్థాన్ 191 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

ఈ మ్యాచ్ అహ్మదాబాద్ లోని ప్రపంచంలోనే అతి పెద్దదైన నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. 13 ఓవర్లలో 74 పరుగులు చేసిన పాకిస్థాన్ 2 మూడు వికెట్లు కోల్పోయి పటిష్ట స్థితిలో ఉంది. ఆ తర్వాత భారత బౌలర్లు రాణించడంతో ఒక్కొక్కరు పెవిలియ్ బాట పట్టారు. 42.5 ఓవర్లలో 191 అలౌట్ అయ్యింది. పాక్ కెప్టెన్ బాబర్ (58 బంతుల్లో 50), వికెట్ కీపర్ రిజ్వాన్ (69 బంతుల్లో 49) మాత్రమే రాణించారు. అంతకుమిందు షఫీక్, ఇమామ్ పర్వాలేదని అనిపించారు. కానీ భారీ స్కోర్లు రాబట్టడంలో మాత్రం విఫలమయ్యారు. ఇక మిడిల్ ఆర్డర్ అంతా తుస్సు మనడంతో తక్కువ స్కోరుకే పాక్ తోక ముడిచింది. కాగా భారత బౌలర్లలో శార్దుల్ మాత్రమే వికెట్ పడగొట్టలేకపోయాడు.

వికెట్ల వేట మొదలైందిలా

41/1 (A. Shafique, 7.6 ov) · 73/2 (Imam-ul-Haq, 12.3 ov) · 155/3 (B. Azam, 29.4 ov) · 162/4 (S. Shakeel, 32.2 ov) · 166/5 (I. Ahmed, 32.6 ov) · 168/6 (M. Rizwan, 33.6 ov) · 171/7 (S. Khan, 35.2 ov) · 187/8 (M. Nawaz, 39.6 ov) · 187/9 (H. Ali, 40.1 ov) · 191/10

Also Read: Vijay Deverakonda: ఫ్యామిలీ స్టార్ వచ్చేది ఆరోజే

  Last Updated: 14 Oct 2023, 05:57 PM IST