Site icon HashtagU Telugu

Miracle Incident : 300 అడుగుల లోతు బోరు బావిలో పడిన చిన్నారి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

Gywy0ytp

Gywy0ytp

చిన్నారులు బోరు బావిలో పడి మరణించిన ఘటనలు ఇప్పటికే ఎన్నో చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే అధికారులు కష్టపడి ఆ చిన్నారులను ప్రాణాలతో రక్షించినప్పటికీ ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ బోరుబావుల ఘటనలో చాలా తక్కువ మంది చిన్నారుల మాత్రమే బతికి బయట పడ్డారు. ఈ బోరుబావుల విషయంలో అధికారులు ఇప్పటికే పలుసార్లు హెచ్చరించినప్పటికీ చిన్నారుల తల్లిదండ్రులు మాత్రం అప్రమత్తంగా ఉండడం లేదు.

ఇదిలా ఉంటే తాజాగా గుజరాత్లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. గుజరాత్ లోని సురేంద్ర నగర్ జిల్లా దృంగధర తాలూకాలో రుధ్ పూర్ లో ఒక 18 నెలల శివమ్ అనే బాలుడు ఆడుతూ వెళ్లి బోరుబావిలో పడ్డాడు. గమనించిన తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే ఆర్మీ క్విక్ బరిలోకి దిగింది. అయితే ఆ బాలుడి అరుపులు విన్న వారు 25 అడుగుల లోతులో చిక్కుకుపోయినట్లు గుర్తించారు. వెంటనే అప్రమత్తమై పనులు మొదలు పెట్టగా మెటాలిక్ హుక్ తగిలించిన ఒక తాడు ను ఆ బోరుబావిలో విడిచారు.

 

అలా 40 నిమిషాల తర్వాత కష్టపడ్డాక అదృష్టవశాత్తూ ఆ హుక్ బాలుడు టీ షర్ట్ కి తగిలింది. దీంతో వెంటనే ఆ బాలుడిని సురక్షితంగా బయటికి తీయడంతో స్థానికులు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో ఆర్మీ వ్యవహరించిన చాకచక్యం కి అందరూ ఆర్మీ రెస్క్యూ టీం పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అదేవిధంగా బాలుడికి ఒక చిన్న గాయం కూడా అవ్వకుండా బయటకు తీయడంతో ఈ వీడియోను చూసిన వారు కూడా ఆశ్చర్యపోతున్నారు.