Site icon HashtagU Telugu

Video: చలిలో దేశ రక్షణకు సైనికులు ఇలా..

Snow

Snow

సైనికులు దృఢ నిశ్చయంతో, కర్తవ్య దీక్షతో దేశ రక్షణకై పెద్ద పీట వేస్తారు. ప్రాణాలను సైతం ఎదురొడ్డి భరత మాతకు సేవ చేస్తారు. రక్షణ శాఖ ట్విట్టర్ వేదికగా విడుదల చేసిన ఫొటోలు వారి అంకిత భావానికి అద్దం పడుతున్నాయి.

ఉత్తరాది మొత్తం చలితో ఇంటి నుంచి బయటికి రావడానికే భయపడే పరిస్థితులు ఉన్నాయి. హిమాలయాల గురించి ఇక వేరే చెప్పనక్కర్లేదు. ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీల్లో ఉన్నాయి. రక్తం గడ్డ కట్టి, చావు తప్పదనే విధంగా పరిస్థితి ఉంటుంది. అయినా భరత మాత ముద్దుబిడ్డలైన సైనికులు మొక్కవోని దీక్షతో, పట్టుదలతో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సరిహద్దులను కాపాడుతున్నారు.