Site icon HashtagU Telugu

Expensive House: అమ్మకానికి రూ.1600 కోట్ల ఇంద్రభవనం.. దానిపై భారతీయుడి మోజు?

Expensive House

Expensive House

దుబాయ్ లగ్జరీ భవనాలకు ఎత్తైన శిఖరాలకు పెట్టింది పేరు. కాగా ఇందులో వెర్సైల్స్‌ను తలపించే మార్బుల్‌ ప్యాలెస్ ధర వింటే షాక్‌ అవ్వాల్సిందే. మార్కెట్‌లో దీని ధర 750 మిలియన్ దిర్హామ్‌ల అనగా ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపుగా రూ.1600 కోట్లు పలుకుతోంది. విలాసవంతమైన భవనాలు ఎక్కువగా ఉండే నగరంలో మార్కెట్‌లో అత్యంత ఖరీదైన ఇల్లు అమ్మకానికి వుంది. ఇలాంటి ఇంద్రభవనంపై మోజుపడుతున్న వారిలో భారతీయుడు ఉన్నారు. కాగా ఈ మార్బుల్ ప్యాలెస్ అదిరిపోయే ఫీచర్ లు ఉన్నాయి.

రియల్ ఎస్టేట్ ఏజెంట్లచే మార్బుల్ ప్యాలెస్ గా పిలుస్తున్న ఈ భవనాన్ని అతి ఖరీదైన ఇటాలియన్ మార్బుల్ స్టోన్‌తో నిర్మించారు. Luxhabitat Sotheby’s International Realty విక్రయిస్తున్న ఈ భవన నిర్మాణం దాదాపు 12 సంవత్సరాలు పట్టిందట. 60వేల చదరపు అడుగుల ఇంటిలో ఐదు బెడ్‌రూమ్‌లు ఉంటాయి. ఇందులో మాస్టర్ బెడ్‌రూమ్ 4,000 చదరపు అడుగులు ఒక పెద్ద భవనాన్ని మించి అన్నమాట. ఇంకా 15-కార్ల గ్యారేజ్, 19 రెస్ట్‌రూమ్‌లు, ఇండోర్ అలాగే అవుట్‌డోర్ పూల్స్, రెండు రూఫ్‌లు, 80,000 లీటర్ కోరల్ రీఫ్ అక్వేరియం, ఎలక్ట్రికల్ సబ్‌స్టేషన్ ఎమర్జెన్సీ రూమ్‌లు తదితర ఫీచర్ లు ఇందులో ఉన్నాయి.

Expensive House

ఇది 70 వేల చదరపు అడుగుల స్థలంలో గోల్ఫ్ కోర్స్‌కి ఎదురుగా ఉన్న గేటెడ్ కమ్యూనిటీలో ఉంది. కాగా ఈ ఆస్తిని ఎవరైనా కొనుగోలు చేయవచ్చు లేదంటే అద్దెకు కూడా తీసుకోవచ్చు. అలాగే టెన్నిస్ లేదా పాడెల్ బాల్ కోర్ట్ కోసం ఉపయోగించవచ్చు అని బ్రోకర్ కునాల్ సింగ్ వెల్లడించారు. కునాల్ సింగ్ అంచనా ప్రకారం కేవలం ఐదు నుండి పది మంది సంపన్నులు మాత్రమే ఈ ఇంద్ర భవనాన్ని కొనుగోలు చేయగలరట. అంతేకాదు గత మూడు వారాల్లో కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఇంటిని చూశారు. ఇందులో రష్యాకు చెందిన కొనుగోలు ప్రతినిధి ఒకరు కాగా, రెండో కస్టమర్ ఎమిరేట్స్ హిల్స్‌లో ఇప్పటికే మూడు నివాసాలను కలిగి ఉన్న ఇండియన్‌ కావడం గమనార్హం. ఆయన భార్య ఇంకొంచెం మెరుగైన దాని కోసం చూస్తోందని అందుకే నిర్ణయం తీసుకోలేదని సింగ్ పేర్కొన్నాడు.