Site icon HashtagU Telugu

Cricket: దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం

Template 2021 12 30t171935

Template 2021 12 30t171935

సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. సౌతాఫ్రికాపై భారత్ 113 పరుగుల తేడాతో విజయకేతనం ఎగురవేసింది. ఈ విజయంతో మూడు టెస్టుల సిరీస్ లో భారత్ 1-0 ఆధిక్యతను సాధించింది.

రెండో ఇన్నింగ్స్ లో 305 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 191 పరుగులకే ఆలౌట్ అయింది. దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్లలో ఎల్గర్ (77), బవుమా (35), డికాక్ (21) మినహా మిగిలిన బ్యాట్స్ మెన్లు ఎవరూ రాణించలేదు. మొదటి ఇన్నింగ్స్ లో సెంచరీ సాధించి ఇండియాను మెరుగైన స్థితిలో నిలిపిన కేఎల్ రాహుల్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.

తొలి ఇన్నింగ్స్ లో భారత్ 327 పరుగులు చేయగా, దక్షిణాఫ్రికా 197 పరుగులకు ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్ లో భారత్ 174 పరుగులకు ఆలౌట్ కాగా… సౌతాఫ్రికా 191 పరుగులకు ఆలౌట్ అయింది.