Ind Vs SL: భారత్ , శ్రీలంక సిరీస్ లో మార్పులు

ఫిబ్రవరి 24 నుంచి భారత్‌-శ్రీలంక జట్ల మధ్య మొదలు కానున్న టీ20, టెస్ట్‌ సిరీస్‌ల కొత్త షెడ్యూల్‌ను బీసీసీఐ తాజాగా విడుదల చేసింది...

Published By: HashtagU Telugu Desk
Team India Cricket

Team India Cricket

ఫిబ్రవరి 24 నుంచి భారత్‌-శ్రీలంక జట్ల మధ్య మొదలు కానున్న టీ20, టెస్ట్‌ సిరీస్‌ల కొత్త షెడ్యూల్‌ను బీసీసీఐ తాజాగా విడుదల చేసింది… ఇరు జట్ల మధ్య తొలుత ప్రకటించిన విధంగాముందు టెస్ట్‌ సిరీస్‌ కాకుండా టీ20 సిరీస్ జరగనుంది. భారత్‌-శ్రీలంక జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ ఫిబ్రవరి 24న లక్నో వేదికగా జరగనుండగా , రెండో టీ20 మ్యాచ్ ఫిబ్రవరి 26న , మూడో టీ20 మ్యాచ్ ఫిబ్రవరి 27న ధర్మశాల వేదికగా జరగనున్నాయి. ఆ తర్వాత ఇరు జట్ల మధ్య తొలి టెస్ట్‌ మార్చి 4 నుంచి మొహాలీ వేదికగా జరగనుండగా , రెండో టెస్ట్‌ మార్చి 12 నుంచి బెంగళూరు వేదికగా జరగనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది…

ఇదిలా ఉంటే, ప్రస్తుతం రోహిత్‌ శర్మ సారధ్యంలోని టీమిండియా.. వెస్టిండీస్‌తో టీ ట్వంటీ సీరీస్ ఆడుతుండగా..ముగిసిన వెంటనే కోల్‌కతా నుంచి టీమిండియా లక్నోకి వెళ్లనుంది. అలాగే ప్రస్తుతం శ్రీలంక జట్టు ఆస్ట్రేలియాతో ఐదు టీ 20 మ్యాచ్‌ల సిరీస్‌ ఆడుతోంది. ఈ క్రమంలో ఆదివారం అక్కడ టీ20 సిరీస్‌ని ముగించుకుని లంకేయులు నేరుగా భారత్‌కి రానున్నారు. అయితేపొట్టి ఫార్మాట్ ఆడిన వెంటనే సుదీర్ఘ ఫార్మాట్లో ఆడటం కష్టం అవుతోందని బీసీసీఐని శ్రీలంక క్రికెట్ రిక్వెస్ట్ చేయగా.. బీసీసీఐ స్వల్ప షెడ్యూల్‌లోస్వల్ప మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది.

  Last Updated: 16 Feb 2022, 04:22 PM IST