Site icon HashtagU Telugu

India vs Pakistan: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా.. తుది జట్టు ఇదే..!

India vs Sri Lanka

India vs Sri Lanka

India vs Pakistan: 2023 ప్రపంచకప్‌ కోసం భారత్‌, పాకిస్థాన్‌ల (India vs Pakistan) మధ్య పోరు మొదలైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. టీమ్ ఇండియా ప్లేయింగ్-11లో ఒకే ఒక్క మార్పు చోటు చేసుకుంది. ఇషాన్ కిషన్ స్థానంలో శుభ్‌మన్ గిల్ జట్టులోకి తిరిగి వచ్చాడు. మరోవైపు పాక్ జట్టులో ఎలాంటి మార్పు లేదు.

టాస్ గెలిచిన అనంతరం భారత కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. మేం ముందుగా బౌలింగ్ చేయనున్నాం. ఇది మంచి పిచ్‌గా కనిపిస్తోంది. మా ప్లేయింగ్-11లో పెద్దగా మార్పు లేదు. ఇషాన్ స్థానంలో శుభ్‌మన్ గిల్ తిరిగి వచ్చాడు. గత ఏడాది కాలంలో గిల్ అద్భుతంగా రాణించాడు. ముఖ్యంగా ఈ మైదానంలో గిల్ అవసరం అని చెప్పాడు.

బాబర్ ఆజం మాట్లాడుతూ.. మేము కూడా ఈ మైదానంలో ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నాం. మా చివరి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించాం. మేము మంచి రిథమ్‌లో ఉన్నాము. మా ఆత్మవిశ్వాసం ఎక్కువ. మా జట్టులో ఎలాంటి మార్పు లేదు అని చెప్పాడు.

Also Read: Discount Offer: 3 గంటల్లో శ్రీలంకకు.. ఫెర్రీ సర్వీసులు షురూ.. టికెట్ రూ.2800 మాత్రమే!

We’re now on WhatsApp. Click to Join.

టీమిండియా జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా.

పాకిస్థాన్ జట్టు: అబ్దుల్లా షఫీక్, ఇమామ్ ఉల్ హక్, బాబర్ ఆజం (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), సౌద్ షకీల్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, షాహీన్ అఫ్రిది, హసన్ అలీ, హరీస్ రవూఫ్.