Site icon HashtagU Telugu

India vs Australia: స్టార్క్ దెబ్బకు భారత్ విలవిల

India vs Australia

Resizeimagesize (1280 X 720) (5)

విశాఖ వన్డేలో భారత (India) బ్యాటింగ్ కుప్పకూలింది. ఊహించని విధంగా టాపార్డర్ లో కోహ్లీ తప్పిస్తే అంతా ఘోరంగా విఫలమయ్యారు. 10 ఓవర్లు కూడా పూర్తి కాక ముందే సగం జట్టు పెవిలియన్ కు చేరింది. ఓపెనర్ శుభమన్ గిల్ డకౌటవగా.. కెప్టెన్ రోహిత్ శర్మ 13 (2 ఫోర్లు) రన్స్ కు ఔటయ్యాడు. వీరిద్దరినీ మిఛెల్ స్టార్క్ ఔట్ చేశాడు. కాసేపటికే సూర్యకుమార్ యాదవ్ కూాడా డకౌటవగా.. తొలి వన్డేలో హాఫ్ సెంచరీతో రాణించిన కెెఎల్ రాహుల్ 9 రన్స్ కు వెనుదిరిగాడు. ఒకవైపు కోహ్లీ ధాటిగా ఆడుతున్నా మిగిలిన బ్యాటర్లు పెవిలియన్ కు క్యూ కట్టారు. హార్థిక్ పాండ్యా కూడా 1 పరుగుకే ఔటయ్యాడు. ఫలితంగా భారత్ 49 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఇక కోహ్లీ, జడేజాలపైనా టీమిండియా ఆశలు పెట్టుకుంది.

Also Read: India vs Australia: భారత్- ఆస్ట్రేలియా మ్యాచ్ లో సందడి చేసిన నాని

ఇదిలా ఉంటే ఇవాళ ఉదయం వరకూ టెన్షన్ పెట్టిన వర్షం మధ్యాహ్నానికి తెరిపినివ్వడంతో మ్యాచ్ నిర్ణీత సమయానికే ఆరంభమైంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో భారత్ రెండు మార్పులు చేసింది. ఇషాన్ కిషన్ స్థానంలో కెప్టెన్ రోహిత్ శర్మ జట్టులోకి తిరిగి వచ్చాడు. అలాగే శార్థూల్ ఠాకూర్ స్థానంలో అక్షర్ పటేల్ కు చోటు దక్కింది.అటు ఆసీస్ జట్టులో కూడా రెండు మార్పులు జరిగాయి. మాక్స్ వెల్ స్థానంలో ఎలిస్ , ఇంగ్లీస్ స్థానంలో క్యారీ జట్టులోకి వచ్చారు.