India vs Australia: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. టీమిండియాలో రెండు మార్పులు..!

విశాఖ వేదికగా మరికాసేపట్లో భారత్- ఆస్ట్రేలియా (India vs Australia) మధ్య రెండో వన్డే ప్రారంభం కానుంది. దీంట్లో భాగంగా టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది.

  • Written By:
  • Updated On - March 19, 2023 / 01:18 PM IST

విశాఖ వేదికగా మరికాసేపట్లో భారత్- ఆస్ట్రేలియా (India vs Australia) మధ్య రెండో వన్డే ప్రారంభం కానుంది. దీంట్లో భాగంగా టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. వర్షం తగ్గడం, అనుకున్న సమయానికి మ్యాచ్‌ జరుగుతుండటంతో ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు. ఇప్పటికే ఒక మ్యాచ్ గెలుపుతో ఊపుమీద ఉన్న రోహిత్ సేన రెండో వన్డేలో కూడా విక్టరీ కొట్టేందుకు రెడీ అయ్యింది.

Also Read: KL Rahul: కేఎల్ రాహుల్‌ పై రవిశాస్త్రి ప్రశంసలు.. ఇంగ్లండ్‌లో రాణించే సత్తా ఉంది అంటూ కామెంట్స్..!

ఆస్ట్రేలియా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. కంగారూ జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్ ప్లేయింగ్-11లో రెండు మార్పులు చేశాడు. గ్లెన్ మాక్స్‌వెల్, జోష్ ఇంగ్లిస్‌లను తొలగించారు. వారి స్థానంలో ప్లేయింగ్-11లో అలెక్స్ కారీ, నాథన్ ఎల్లిస్‌లను చేర్చారు. అదే సమయంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ప్లేయింగ్-11లో రెండు మార్పులు చేశాడు. ఇషాన్ కిషన్, శార్దూల్ ఠాకూర్‌లను తొలగించారు. రోహిత్, అక్షర్ పటేల్ మళ్లీ జట్టులోకి వచ్చారు.

వెదర్ రిపోర్ట్

రెండో వన్డేకు వర్షం ఆటంకం కలిగించవచ్చు. ఈ మ్యాచ్‌లో ఉరుములతో కూడిన వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ సూచన. వర్షం పడే అవకాశం ఉండటంతో ఇరు జట్ల ఫాస్ట్ బౌలర్లు స్వింగ్ రాబట్టవచ్చు. విశాఖపట్నంలో జరిగే మ్యాచ్‌లో దాదాపు నాలుగు గంటల పాటు వర్షం కురిసే అవకాశం ఉందని అక్యూవెదర్ నివేదిక పేర్కొంది. ఆదివారం మైదానంలో మేఘాలు కమ్ముకునే అవకాశం 77 శాతం ఉంది. అక్కడ మధ్యాహ్నం 1 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. తెల్లవారుజామున వర్షం కురుస్తున్నప్పటికీ ప్రస్తుతానికి వర్షం ఆగిపోయింది.

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ.

ఆస్ట్రేలియా: ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్ (సి), మార్నస్ లాబుషాగ్నే, అలెక్స్ కారీ (వికెట్), కెమెరాన్ గ్రీన్, మార్కస్ స్టోయినిస్, షాన్ అబాట్, నాథన్ ఎల్లిస్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా.