India vs Canada: కెనడాకు భారత్ షాక్.. వీసాల జారీ నిలిపివేత

భారత్, కెనడా మధ్య దౌత్య సంబంధాలు రోజురోజుకి దెబ్బతింటున్నాయి. ఖలీస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారతీయ ప్రమేయం ఉన్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు.

India vs Canada: భారత్, కెనడా మధ్య దౌత్య సంబంధాలు రోజురోజుకి దెబ్బతింటున్నాయి. ఖలీస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారతీయ ప్రమేయం ఉన్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. దీంతో కెనడా- భారత్ మధ్య వివాదం చెలరేగింది. ఈ క్రమంలో భారత రాయబారిపై కెనడా ప్రభుత్వం నిషేధం విధించింది. బదులుగామోడీ ప్రభుత్వం కెనడా రాయబారిపై యాక్షన్ తీసుకుంది. దేశం విడిచి వెళ్లిపోవాలని హెచ్చరించింది.

ఇలా ఇరు దేశాల మధ్య వివాదం రోజురోజుకి ఎక్కువవుతున్న క్రమంలో ఈ రోజు భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కెనడా పౌరులకు భారత్ వీసాలను నిలిపివేస్తూ భారత్ నిర్ణయం తీసుకుంది.సెప్టెంబర్ 21నుండి తదుపరి నోటీసు వచ్చే వరకు వీసాలను నిలిపివేయనున్నట్లు తెలిపింది. ఇక ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లో ఈ రోజు కెనడాలో మరో ఖలీస్థాన్ ఉగ్రవాది హత్యకు గురయ్యాడు. రెండు గ్రూపుల మధ్య జరిగిన గొడవలో ఖలిస్తానీ టెర్రరిస్ట్ సుఖ్‌దూల్ సింగ్ అలియాస్‌ సుఖా దునేకేను హత్య చేశారు.

అంతకుముందు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక సలహా జారీ చేసింది. కెనడా వెళ్లే వారు జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. కెనడాలో భారత వ్యతిరేక కార్యకలాపాలు సాగించే ఏ ప్రాంతానికి కూడా వెళ్లకూడదని సూచించింది. కెనడాలో నేరాలు, ద్వేషపూరిత నేరాలు పెరిగిపోయాయని తెలియజేసింది. కెనడాలో ఉన్న భారతీయ హైకమిషన్ కూడా కెనడాలో ఉన్న వారితో అధికారులు టచ్‌లో ఉంటారని చెప్పారు.

Also Read: Harish Rao: కేసీఆర్ కిట్లు ఇస్తుంటే, కాంగ్రెస్, బీజేపీ తిట్లను ఇస్తోంది: హరీశ్ రావు