Site icon HashtagU Telugu

Agni Prime Missile: అగ్ని ప్రైమ్ క్షిపణి విజయవంతం!

శుక్రవారం ఉదయం 9.45 గంటలకు ఒడిశా తీరంలో కొత్త తరం అణు సామర్థ్యం గల బాలిస్టిక్ క్షిపణి అగ్ని ప్రైమ్ ని విజయవంతమైంది. టెస్ట్ ఫ్లైట్ సమయంలో క్షిపణి గరిష్ట పరిధిలో ప్రయాణించింది. అగ్ని ప్రైమ్ క్షిపణి ఈ వరుసగా మూడోసారి సక్సెస్ అయ్యింది. ఉపరితలానికి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణి 1000 నుంచి 2000 కి.మీ. అణు సామర్థ్యం గల ఈ క్షిపణిని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) రూపొందించింది. అంతకుముందు డిసెంబర్ 2021లో DRDO ఒడిశా తీరంలోని డాక్టర్ APJ అబ్దుల్ కలాం ద్వీపం నుంచి అగ్ని ప్రైమ్‌ని విజయవంతంగా పరీక్షించిన విషయం తెలిసిందే.