Site icon HashtagU Telugu

India Reports: 24 గంటల్లో 24 మంది బలి.. కోవిడ్ నాలుగో దెబ్బ!

Corona India

Corona India

కరోనా పూర్తిగా తగ్గిపోయినట్టే భావిస్తున్న సమయంలో ఒక్కసారిగా పంజా విసిరింది. ఫలితంగా దేశంలో రోజురోజుకూ కేసులు పెరిగిపోతున్నాయి. వైరస్ వ్యాప్తితో వేల సంఖ్యలో జనం కరోనా బారిన పడుతున్నారు. గడిచిన 24 గంటల్లో కోవిడ్ దెబ్బకు 24 గంటల్లో 24 మంది బలయ్యారు. మనదేశంలో శుక్రవారం 7,584 తాజా కోవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా 24 కొత్త కోవిడ్ మరణాలు సంభవించాయి.

మరణాల సంఖ్య 5,24,747 కు పెరిగింది. క్రియశీలక కేసులు 36,267 కేసులకు చేరాయి. ఇది దేశంలోని మొత్తం పాజిటివ్ కేసులలో 0.08 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 3,791 మంది రోగులు కోలుకోవడంతో మొత్తం సంఖ్య 4,26,44,092కి చేరుకుంది. పర్యవసానంగా, భారతదేశం యొక్క రికవరీ రేటు 98.70 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.26 శాతానికి పెరగగా, వారంవారీ పాజిటివిటీ రేటు 1.50 శాతంగా ఉంది. అదే సమయంలో, దేశవ్యాప్తంగా మొత్తం 3,35,050 పరీక్షలు నిర్వహించబడ్డాయి. మొత్తం సంఖ్య 85.41 కోట్లకు పెరిగింది.

పెరుగుతున్న కొవిడ్‌ కేసులు నాలుగో వేవ్‌కు సంకేతమా? త్వరలోనే కొత్తవేవ్‌ రానుందా? ఈ ప్రశ్నలకు కర్ణాటక వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్‌ డి. రణదీప్‌ అవుననే అంటున్నారు. కర్ణాటక, మహారాష్ట్రల్లో పెరుగుతున్న కేసులే ఇందుకు నిదర్శనమని చెబుతున్నారు. అయితే.. నాలుగో వేవ్‌ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చన్నారు. థర్డ్‌వేవ్‌ మాదిరిగానే కొద్దిపాటి లక్షణాలుండడమో.. పూర్తిగా లక్షణాలు లేకపోవడం కనిపించవచ్చన్నారు. ముందుజాగ్రత్తలు, మాస్కులధారణతో దాన్ని ఎదుర్కోవచ్చని వివరించారు. మరో మూడు నాలుగు వారాల్లో ఫోర్త్‌వేవ్‌ రావొచ్చనడానికి సంకేతమని పేర్కొన్నారు.