Site icon HashtagU Telugu

Covid-19 Updates: దేశంలో కొత్త కరోనా కేసులివే!

Corona India

Corona India

దేశవ్యాప్తంగా వారం రోజుల క్రితం వెయ్యిలోపే నమోదైన కరోనా కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్య కూడా స్వల్పంగా పెరిగింది. ఈ మేరకు ఆదివారం ‘కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ’ కరోనా కేసుల వివరాలను వెల్లడించింది. ఒక్క రోజులో మొత్తం 3,324 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య 4,30,79,188కి చేరుకుంది.

అయితే పాజిటివ్ కేసుల సంఖ్య 19,092కి పెరిగింది. 40 మరణాలతో.. మరణాల సంఖ్య 5,23,843కి చేరుకుంది. క్రియాశీల కేసులు 0.04 శాతం కాగా, జాతీయ కోవిడ్-19 రికవరీ రేటు 98.74 శాతంగా నమోదైందని మంత్రిత్వ శాఖ తెలిపింది. 24 గంటల వ్యవధిలో కోవిడ్-19కేసులు 403 కేసులు పెరిగాయి. వ్యాధి నుండి కోలుకున్న వారి సంఖ్య 4,25,36,253కి చేరుకోగా, కేసు మరణాల రేటు 1.22 శాతంగా నమోదైంది. ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రజలు మాస్కులు విధిగా ధరిస్తున్నారు.