Site icon HashtagU Telugu

Covid Updates: రెండు లక్షలకు చేరువలో కరోనా కేసులు!

corona

corona

భారతదేశంలో గత 24 గంటల్లో 1,94,720 COVID-19 కేసులు, 442 మరణాలు నమోదయ్యాయని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. దీంతో దేశంలో మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 9,55,319 యాక్టివ్ కేసులతో సహా 3,60,70,510కి పెరిగింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 2.65 శాతం. ఇప్పటివరకు 69.52 కోట్ల మొత్తం పరీక్షలు నిర్వహించగా, వారానికి 9.82 శాతం పాజిటివ్‌ రేటు నమోదైంది. మహారాష్ట్రలో మంగళవారం 34,424 కేసులు, ఢిల్లీలో 21, 259 కేసులు, పశ్చిమ బెంగాల్‌లో 21,098, కర్ణాటకలో 14,473, మిగిలిన కేసులు ఇతర రాష్ట్రాల నుంచి నమోదయ్యాయి. కాగా దేశవ్యాప్తంగా ఓమిక్రాన్ కేసులు 4,868 వెలుగుచూశాయి. ఇప్పటివరకు 153.80 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లను అందించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.