India Rejected Chinese Car maker : ఏకంగా రూ.8వేల కోట్ల పెట్టుబడితో ఇండియాలో ఎలక్ట్రిక్ కార్ల తయారీ ప్లాంట్ పెట్టేందుకు ముందుకొచ్చిన కంపెనీకి కేంద్ర సర్కారు నో చెప్పింది.
ఇందుకోసం చైనాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ BYD (బీవైడీ) చేసిన దరఖాస్తును భారత సర్కారు రెజెక్ట్ చేసింది.
హైదరాబాద్‌కు చెందిన మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌తో కలిసి ఇండియాలో ఎలక్ట్రిక్ కార్ల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తామని BYD చేసిన ప్రతిపాదనను తిరస్కరించింది.
జాతీయ భద్రతా కారణాల రీత్యా కార్ల ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ఆ కంపెనీకి కేంద్ర ప్రభుత్వానికి చెందిన డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (DPIIT) పర్మిషన్ ఇవ్వలేదని తెలుస్తోంది.
Also read : AP Capital : కేసీఆర్ కళ్లలో ఆనందం కోసం జగన్ ! అమరావతి కూల్చివేత!!
అయితే BYD కి నో చెప్పడానికి ముందు.. ఈ ప్రతిపాదనపై DPIIT అనేక ఇతర కేంద్ర ప్రభుత్వ విభాగాల నుంచి అభిప్రాయాన్ని కూడా కోరింది. ఈక్రమంలో భారతదేశంలో చైనా పెట్టుబడులకు సంబంధించిన భద్రతాపరమైన ఆందోళనల అంశం DPIIT దృష్టికి వచ్చింది. దీంతో ప్రస్తుత నిబంధనల ప్రకారం.. అటువంటి పెట్టుబడిని ఆమోదించలేమని చైనా కార్ల తయారీ కంపెనీ BYDకి DPIIT తేల్చి చెప్పింది.
Also read : Red Diary Warning To CM : “రెడ్ డైరీ” బయటపెడితే సీఎం జైలుకే.. మాజీ మంత్రి గూడా సంచలన వ్యాఖ్యలు
“మేఘా” పెట్టుబడితో ప్లాంట్..
DPIITకి ఇచ్చిన ప్రతిపాదన ప్రకారం.. ప్రతి సంవత్సరం 10,000 నుంచి 15,000 ఎలక్ట్రిక్ కార్లను తయారు చేస్తామని చైనా కంపెనీ BYD తెలిపింది. ఈ కార్ల ప్లాంట్ ఏర్పాటు కోసం హైదరాబాద్‌కు చెందిన మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ పెట్టుబడి పెడుతుందని, తమ కంపెనీ సాంకేతికత పరిజ్ఞానాన్ని అందిస్తుందని BYD పేర్కొంది. భారత్, చైనాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు BYD కి కేంద్ర సర్కారు నో చెప్పిందని సమాచారం.
ఇప్పటికే ఇండియాలో BYD..
అయితే BYD కంపెనీ ప్రస్తుతం భారతీయ మార్కెట్లో అటో 3 (BYD ATTO 3), e6 (byd e6) అనే రెండు ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తోంది. ఇవే కాకుండా.. ఈ సంవత్సరం చివరి నాటికి తన “BYD Seal” EV కారును భారతదేశంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.
Also read : Weather Warning: రాగల మూడు రోజుల్లో తెలంగాణలో వర్షాలు
గతంలో GMWకు ఇలాగే నో..
గతంలో మరో చైనీస్ కార్ల కంపెనీ గ్రేట్ వాల్ మోటార్ (GMW) కూడా 1 బిలియన్ డాలర్ల పెట్టుబడితో భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించింది. దాదాపు రెండున్నర సంవత్సరాలు వేచి ఉన్న తర్వాత.. భారత ప్రభుత్వం నో చెప్పడంతో పెట్టుబడి ప్రణాళికను వాయిదా వేసుకుంది.